Homeఎక్స్ క్లూసివ్దిల్ రాజుతో అదిరిపోయే కంటెంట్ చేయనున్నాను - విజయ్ దేవరకొండ

దిల్ రాజుతో అదిరిపోయే కంటెంట్ చేయనున్నాను – విజయ్ దేవరకొండ

దిల్ రాజుతో అదిరిపోయే కంటెంట్ చేయనున్నాను - విజయ్ దేవరకొండ
దిల్ రాజుతో అదిరిపోయే కంటెంట్ చేయనున్నాను – విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ తన కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నాడు. హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా యూత్ లో ఫుల్ క్రేజ్ ను తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. తాను ప్రస్తుతం  చేస్తోన్న చిత్రం లైగర్ ద్వారా ప్యాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకోవాలి అనుకుంటున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న లైగర్ మొత్తం ఐదు భాషల్లో విడుదల కానుంది.

ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. యూఎస్ లో ఒక భారీ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. దీని తర్వాత విజయ్ చేయబోయే చిత్రం ఏంటనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుందన్నారు కానీ అది రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక సుకుమార్ దర్శకత్వంలో సినిమా ఉంది కానీ ప్రస్తుతం పుష్ప చిత్రంతో ఫుల్ బిజీగా ఉన్నాడు సుకుమార్. పుష్ప పార్ట్ 2 కూడా వస్తుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేం.

- Advertisement -

ఇక రౌడీ బాయ్స్ సాంగ్ లాంచ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు విజయ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ దిల్ రాజు నిర్మాణంలో ఒక మైండ్ బ్లోయింగ్ కంటెంట్ ను చేయబోతున్నట్లు, త్వరలోనే దాని డీటెయిల్స్ ను ఇస్తామని తెలిపాడు విజయ్. మరి దానికి దర్శకుడు ఎవరన్నది క్లారిటీ ఇవ్వలేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All