Homeటాప్ స్టోరీస్వరుడు మొదట నాగ చైతన్యట!!

వరుడు మొదట నాగ చైతన్యట!!

వరుడు మొదట నాగ చైతన్యట!!
వరుడు మొదట నాగ చైతన్యట!!

యంగ్ హీరో నాగ శౌర్య కథానాయకుడిగా నటించిన చిత్రం వరుడు కావలెను. ఈ వారాంతం ఈ చిత్రం విడుదలకు సిద్ధపడుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. వరుడు కావలెను టీమ్ వినూత్నంగా హైదరాబాద్ లో జరిగే పెళ్లిళ్లకు  కూడా అటెండ్ అయ్యారు. తమ సినిమా పెళ్లి చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఇది వర్కౌట్ అవుతుందని భావించారు. ఇదిలా ఉంటే ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకోనుంది ఈ చిత్రం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్ గా రానున్నాడు.

వరుడు కావలెను ద్వారా లక్ష్మి సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతోంది. ప్రముఖ నిర్మాణ  సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇక ఇటీవలే ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ వరుడు కావలెను చిత్రానికి మొదట హీరోగా నాగ చైతన్యను అనుకున్నట్లు తెలిపింది. “ఈ కథ 2017లోనే నిర్మాత చినబాబు గారికి చెప్పాను. ఆయనకు చాలా బాగా నచ్చి కచ్చితంగా చేద్దామన్నారు. హీరోగా నా మైండ్ లో నాగ చైతన్య ఉన్నాడు మొదట. హీరో పాత్ర చాలా సాఫ్ట్ గా, హుందాగా ఉండాలి. అప్పుడు నా ఫస్ట్ ఛాయస్ నాగ చైతన్య అయ్యాడు. అయితే అలా వర్కౌట్ కాలేదు. వెంటనే నా మైండ్ లోకి వచ్చిన పేరు నాగ శౌర్య” అని తెలిపింది లక్ష్మి సౌజన్య.

- Advertisement -

వరుడు కావలెను చిత్రంలో హీరోయిన్ గా రీతూ వర్మ నటించింది. రెండు పాటలకు థమన్ సంగీతం అందించగా  విశాల్ చంద్రశేఖర్ మిగిలిన పాటలకు మ్యూజిక్ స్కోర్ చేసాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All