Friday, December 9, 2022
HomeVideosనాట్యం ట్రైలర్ ను లాంచ్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

నాట్యం ట్రైలర్ ను లాంచ్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

నాట్యం ట్రైలర్ ను లాంచ్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
నాట్యం ట్రైలర్ ను లాంచ్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్య రాజు ప్రధాన పాత్ర పోషించిన నాట్యం ట్రైలర్ విడుదలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్ ను లాంచ్ చేసారు. అలాగే ఈ చిత్రానికి తన శుభాకాంక్షలు తెలియజేసారు. నాట్యం టైటిల్ కు తగ్గట్లుగానే డ్యాన్స్ బేస్డ్ డ్రామా. ఈ ట్రైలర్ అత్యంత ఆసక్తికరంగా ఉంది. డ్యాన్స్ తో ఈ సమాజంలో, ఆలోచనల్లో మార్పు తీసుకురాగలము అని నమ్మే ఒక కుటుంబం, దానికి అడ్డుపడే పరిస్థితులు, పెద్దలు… ఇలా రకరకాల అనుభవాలతో నాట్యం కథను రూపొందించినట్లు అర్ధమవుతోంది.

- Advertisement -

సంధ్య రాజు హీరోయిన్ గా నటించడంతో పాటు ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ కూడా. అలాగే ఈ చిత్రాన్ని నిర్మించడం కూడా జరిగింది. అలాగే కొరియోగ్రాఫర్, ప్రొడక్షన్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేసింది సంధ్య రాజు. రేవంత్ కోరుకొండ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. ఆయన లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఇదొక అద్భుతమైన కథ అని ప్రేక్షకులకు అన్ని విధాలా నచ్చుతుందని వ్యాఖ్యానించాడు.

ఈ చిత్రంలో కమల్ కామరాజు, ఆదిత్య మీనన్, రోహిత్ బెహల్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నాట్యం చిత్రాన్ని ఇటీవలే సంధ్య రాజు బిగ్ బాస్ వేదికపై కూడా ప్రమోట్ చేసిన విషయం తెల్సిందే.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts