
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ ఆర్ ఆర్ ఆర్ వలన కొంచెం స్లో అయింది. అది రాజమౌళి సినిమా కాబట్టి అర్ధం చేసుకోవచ్చు. అందులోనూ కరోనా కారణంగా బ్రేకులు పడుతూ షూటింగ్ సాగింది. అయితే ఎలాగైతేనేం రాజమౌళి చిత్రాన్ని పూర్తి చేసాడు చరణ్. ఆర్ ఆర్ ఆర్ జనవరి 7 2022న విడుదల కానుంది. ఆర్ ఆర్ ఆర్ ను పూర్తి చేసాక చరణ్ తన స్పీడ్ ను చూపిస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను సెట్ చేసాడు.
ఇప్పటికే సౌత్ ఇండియన్ అగ్ర దర్శకుడు శంకర్ తో సినిమాను అనౌన్స్ చేసిన రామ్ చరణ్ దసరా సందర్భంగా మరో అనౌన్స్మెంట్ చేసాడు. జెర్సీ సినిమాతో తనను తాను నిరూపించుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించనున్నాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా తరహాలోనే తెరకెక్కనుంది.
రామ్ చరణ్ – శంకర్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోందన్న విషయం తెల్సిందే. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ రేంజ్ లో నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుంది. ఇక రామ్ చరణ్ – గౌతమ్ తిన్ననూరి – యూవీ క్రియేషన్స్ సినిమాకు సంబంధించి మిగతా వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
A combination I’m definitely looking forward to! @gowtam19 @UV_Creations @NVRCinema #RCwithGowtam https://t.co/OEfOUIs5xY
— Ram Charan (@AlwaysRamCharan) October 15, 2021