Homeటాప్ స్టోరీస్థియేటర్లే కాదు.. ఇకపై షూటింగ్ కు కూడా బంద్!

థియేటర్లే కాదు.. ఇకపై షూటింగ్ కు కూడా బంద్!

థియేటర్లే కాదు.. ఇకపై షూటింగ్ కు కూడా బంద్!
థియేటర్లే కాదు.. ఇకపై షూటింగ్ కు కూడా బంద్!

కరోనా వైరస్ ను అధిగమించడానికి తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని స్కూల్స్, కాలేజీలు, పబ్ లు, షాపింగ్ మాల్స్, థియేటర్లను మూసి వేసిన సంగతి తెల్సిందే. ఈ నెల 21 వరకూ థియేటర్లు, షాపింగ్ మాల్స్, పబ్స్ వంటిపై నిషేధం ఉండగా ఈ నెల 31 వరకూ పాఠశాలలు, కళాశాలలు తెరవకూడదు అని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ చాలా త్వరగా ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది అన్న సంకేతాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీటితో పాటు పలువురు సినిమా షూటింగ్ లకు కూడా విరామం ప్రకటిస్తున్నారు.

బాలీవుడ్ లో జెర్సీ రీమేక్ సహా పలు బాలీవుడ్ సినిమాల షూటింగ్స్ ను అర్ధాంతరంగా నిలిపివేశారు. అదే కోవలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ ఇచ్చిన సంగతి తెల్సిందే. ఇదే బాటలో పలు సినిమాల షూటింగ్స్ ను కూడా ఆపేయాలని ఆయా చిత్ర నిర్మాతలు అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మరియు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కలిసి సంయుక్తంగా ఒక నిర్ణయం తీసుకున్నాయి.

- Advertisement -

రేపటి నుండి ఈ నెల 21 వరకూ అంటే వారం పాటు హైదరాబాద్, తెలంగాణలో జరిగే సినిమా షూటింగ్ లను ఆపేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిర్మాతలకు ఈ నిర్ణయం కొంత కష్టమైనా సరే ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఈ నిర్ణయాన్ని అందరూ అమలు పరచాలని అభిప్రాయపడ్డారు. అంటే రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ తో పాటు కొన్ని బడా సినిమాల షూటింగ్స్ కూడా ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నాయి. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో ఆ చిత్రాలు అన్నీ ఎఫెక్ట్ కానున్నాయి. 21 తర్వాత పరిస్థితిని సమీక్షించి షూటింగ్ జరపాలా వద్దా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని మా, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వారు తెలిపారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All