Homeటాప్ స్టోరీస్ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు కరోనా అడ్డంకి

ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు కరోనా అడ్డంకి

ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు కరోనా అడ్డంకి
ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు కరోనా అడ్డంకి

ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా గురించే డిస్కషన్. మొన్నటి వరకూ విదేశాలకు మాత్రమే పరిమితమనుకున్న ఈ భయానక వైరస్ ఇప్పుడు ఇండియాలో కూడా పుంజుకుంటోంది. కరోనా పాజిటివ్ ఉన్న వారి సంఖ్య వందకు చేరువవుతుండగా ఇప్పటికే ఇద్దరు చనిపోవడం కలవరపెడుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఐదు రాష్ట్రాలు థియేటర్లు, షాపింగ్ మాల్స్, ఎగ్జిబిషన్స్ వంటివన్నీ మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. మహారాష్ట్రలోని ముంబై, పూణేలో కూడా ఈ రకమైన ఆంక్షలు ఉన్నాయి.

దీంతో ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ సజావుగా సాగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోన్న ఆర్ ఆర్ ఆర్ నెలాఖరులో పూణే వెళ్లాల్సి ఉంది. అక్కడ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసింది టీమ్. ఈ నేపథ్యంలో అక్కడి ఆంక్షల వల్ల షూటింగ్ సజావుగా సాగుతుందా లేదా అన్నది ప్రశ్నర్ధకంగా మారింది.

- Advertisement -

ఈ షెడ్యూల్ ఆర్ ఆర్ ఆర్ కు చాలా ముఖ్యమైనది. ఇదే షెడ్యూల్ లో బాలీవుడ్ భామ అలియా భట్ టీమ్ తో జాయిన్ కానుంది. ఆమె ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించనున్న విషయం తెల్సిందే. ఈ భారీ షెడ్యూల్ తో షూట్ దాదాపు పూర్తవుతుందని కూడా అంటున్నారు. మరి ఇలాంటి షెడ్యూల్ కు ఆటంకాలు ఏర్పడితే మళ్ళీ మిగతా పనులు కూడా వాయిదా పడుతాయి. సో ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెల్సిందే. డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. ఎం ఎం కీరవాణి సంగీత దర్శకుడు. దాదాపు 10 భాషల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 8, 2021న విడుదల కానుంది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా అల్లిన ఒక ఫిక్షనల్ కథాంశంతో ఆర్ ఆర్ ఆర్ ఉంటుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All