Homeటాప్ స్టోరీస్సినీజీవుల సంక్షేమం కోసం రూ.1 కోటీ విరాళం : చిరంజీవి

సినీజీవుల సంక్షేమం కోసం రూ.1 కోటీ విరాళం : చిరంజీవి

సినీజీవుల సంక్షేమం కోసం రూ.1 కోటీ విరాళం : చిరంజీవి
సినీజీవుల సంక్షేమం కోసం రూ.1 కోటీ విరాళం : చిరంజీవి
ప్రస్తుతం యావత్ తెలుగు సినీ పరిశ్రమకు పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్న పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు మరో సారి తన పెద్ద మనసు చాటుకున్నారు. భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే నెల 15వ తేదీ వరకు అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రకాల వ్యాపార వాణిజ్యాలు పనులను వాయిదా వేసిన నేపథ్యంలో సినీ పరిశ్రమలో కూడా రకాల పనులు నిలిచిపోయాయి.
అయితే ఈ లాక్ డౌన్ ప్రభావం ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సినిమా పరిశ్రమకు చెందిన  24 విభాగాలకు చెందిన అనేక మంది కార్మికుల పైనా, మరియు సినీ పరిశ్రమను ప్రత్యక్షంగా పరోక్షంగా నమ్ముకొని ఉపాధి వ్యాపారం సాగిస్తున్న ప్రజల మీద పడుతుంది.  సినిమా పరిశ్రమలో పనిచేసే వివిధ రంగాలకు చెందిన కార్మికుల సంక్షేమానికి మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల విరాళం ప్రకటించారు.
“యావత్ భారతదేశం 21 రోజులపాటు లాక్ డౌన్ పాటిస్తున్న ఈ నేపథ్యంలో  అన్ని రంగాలకు రోజువారీ కార్మికులు మరియు దిగువ ఆదాయ తరగతి చెందిన వారి ప్రభావం పడుతుంది. ఈ సంక్షోభం నుంచి మనం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ, సినిమా పరిశ్రమకు చెందిన అనేక రంగాలకు చెందిన కార్మికుల సంక్షేమానికి కోటి రూపాయలు విరాళం ఇస్తున్నాను.” అని సందేశము విడుదల చేసారు చిరంజీవి.
పరిశ్రమ ఇప్పటికీ అనేక మంది  కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా తమ వంతు విరాళాలు అందించిన నేపథ్యంలో చిరంజీవి గారి సోదరుడు పవన్ కళ్యాణ్ గారు రెండు కోట్లు,చిరంజీవి గారి రోడ్ తనయుడు చరణ్ తేజ్ 75 లక్షలు ప్రకటించారు. సామాజిక స్పృహ మరియు సామాజిక బాధ్యత గురించి మెగాఫ్యామిలీ మాటల్లో కాకుండా చేతల్లో స్పందిస్తుందనీ మరోసారి రుజువయింది.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All