Homeటాప్ స్టోరీస్“జనతా కర్ఫ్యూ పాటిద్దాం; కరోనాను అరికడదాం”  – పవన్ కళ్యాణ్

“జనతా కర్ఫ్యూ పాటిద్దాం; కరోనాను అరికడదాం”  – పవన్ కళ్యాణ్

Pawan kalyan support to janata curfew
Pawan kalyan support to janata curfew

భారతదేశం నుండి కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 22వ తేదీ అనగా ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మనం ఉన్న వాతావరణంలో కరోనా వైరస్ వ్యాపించడానికి 6 నుంచి 8 గంటల సమయం పడుతుండటంతో మనమందరం ఒక 14 గంటల వరకు ఎప్పుడైతే మన అన్ని పనులూ తాత్కాలికంగా వాయిదా వేసి ఇళ్ళకు పరిమితం అవుతామో; ఎక్కడో ఒకచోట ఈ వ్యాప్తి చెందటం ఆగే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ ముందుజాగ్రత్తగా శనివారమే తగిన ఏర్పాట్లు చేసుకుని ఆదివారం నిరవధికంగా కర్ఫ్యూ పాటించాలని పవన్ సూచించారు.

అదేవిధంగా కరోనా మహమ్మారి మనలను ఎంతగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో కూడా.. ఎంతో ఓర్పు సహనంతో మనకు సేవ చేస్తున్నడాక్టర్లకు, ఆరోగ్యశాఖ నిపుణులకు, పారిశుద్ధ్య కార్మికులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, జర్నలిస్టులకు కరోనా మహమ్మారి పై ప్రత్యక్ష పోరాటం చేస్తున్నఎందరో కర్మ యోగులకు కృతజ్ఞతాపూర్వకంగా కరతాళ ధ్వనులు చేద్దామని లేదా ఏదో ఒక నాదం చేసి వారికి అందరికీ సామాజిక సంఘీభావం ప్రకటిద్దాం..! అని కూడా పవన్ కళ్యాణ్ తెలియజేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఇరవై నాలుగు విభాగాల వారూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారి వారి పరిధిలో ఉన్న సామాజిక మాధ్యమాల ద్వారా ఈ గొప్ప కార్యక్రమాన్ని ఇంకా ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించి జనాల్లోకి తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All