Homeటాప్ స్టోరీస్“జనతా కర్ఫ్యూ” పాటించడంలో అంతరార్థం ఇదే

“జనతా కర్ఫ్యూ” పాటించడంలో అంతరార్థం ఇదే

“జనతా కర్ఫ్యూ” పాటించడంలో అంతరార్థం ఇదే
“జనతా కర్ఫ్యూ” పాటించడంలో అంతరార్థం ఇదే

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల 80 వేల మంది మరణించినట్లు అధికారిక సమాచారం ఉంది. ఒకసారి మనం గమనించినట్లయితే లక్ష మరణాలు సంభవించడానికి 97 రోజుల సమయం పడితే; 1 లక్ష నుండి రెండు లక్షల మంది మరణించటానికి పట్టిన సమయం కేవలం 12 రోజులు. దీనివల్ల మనం కరోనా మహమ్మారి ఎంత త్వరగా వ్యాపిస్తోందో, నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్తులో ఎంత అపారమైన నష్టం జరుగుతుందో ఇప్పటికైనా మనం అర్థం చేసుకోవాలి. యావత్ భారతదేశం భయాందోళనలో ఉన్నవేళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత జాతిని ఉద్దేశించి తన సందేశాన్ని ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా రాబోయే ఆదివారం అనగా 22 వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ ప్రజల అందరం ప్రజల కోసం కర్ఫ్యూ పాటించాలని ప్రజలు అందరూ సహకరించాలని తెలియజేశారు. ఒకసారి మనం గమనించినట్లైతే ఇలా జనతా కర్ఫ్యూ పాటించడంవల్ల కరోనా వైరస్ నియంత్రణ కొంత వరకు సాధ్యపడే అవకాశం ఉంది.

కరోనా వైరస్ వాతావరణంలో వ్యాప్తి చెందడానికి 8 గంటలనుండి 12 గంటల వరకు సమయం పడుతుంది. ఎప్పుడైతే భారత దేశంలోని ప్రజలందరూ 14 గంటల పాటు తమ ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిరవధికంగా కర్ఫ్యూ పాటిస్తారో.. అప్పుడు ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఈ లింకు ఎక్కడో ఒకచోట బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

- Advertisement -

కాబట్టి వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ప్రభావం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కాకపోతే కొంతమంది ఏకపక్షంగా ఇలా ఖర్చు నిర్ణయం తీసుకోవడం పట్ల విపరీత అర్ధాలు తీస్తున్నప్పటికీ… ప్రధాని ప్రసంగం అనంతరం కొంతమంది నిపుణులు డాక్టర్లు శాస్త్రవేత్తలు పైన తెలిపిన అభిప్రాయాలు వెలిబుచ్చడంతో; ఎక్కువ శాతం మంది ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తూ తాము వచ్చే ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు కర్ఫ్యూ పాటిస్తామని దేశ రక్షణ కోసం తమ వంతు బాధ్యత నిర్వహిస్తామని తెలియజేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All