Homeటాప్ స్టోరీస్విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న మెగా సిస్టర్స్

విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న మెగా సిస్టర్స్

గోర్డాన్ గ్రమ్ అనే విదేశీ లొకేషన్ లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు మెగా సిస్టర్స్ సుస్మిత , నిహారిక . సుస్మిత చిరంజీవి పెద్ద కూతురు అన్న విషయం తెలిసిందే . ఫ్యాషన్ డిజైనర్ గా చిరంజీవి నటించిన పలు చిత్రాలకు పనిచేసింది . ఇక్కడే హైదరాబాద్ లో ఎక్కువగా ఉండే సుస్మిత నిహారిక కంటే చాలా పెద్దమ్మాయి . అయినప్పటికీ తన సోదరులతో అలాగే చెల్లలు నిహారిక , శ్రీజ లతో స్నేహంగా ఉంటుంది .

- Advertisement -

ఇక నిహారిక నాగబాబు కూతురు అన్న విషయం విదితమే ! హీరోయిన్ గా ఈ భామ పలు చిత్రాల్లో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది కానీ ఈ పాపకు హిట్స్ మాత్రం దక్కలేదు పాపం . అసలే ఎండాకాలం కావడంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలిసి విదేశాలకు వెళ్లారు ఎంజాయ్ చేయడానికి . సుస్మిత తో కలిసి ఫోటోలకు ఫోజిచ్చిన నిహారిక ఆ పిక్స్ ని సోషల్ మీడియాలో పెట్టేసింది . నిహారిక సినిమాలు అంతగా ఆడటం లేదు కాబట్టి ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకుంటా !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All