Homeఎక్స్ క్లూసివ్మళ్లీ తాతయ్య అయిన చిరంజీవి

మళ్లీ తాతయ్య అయిన చిరంజీవి

Chiru daughter blessed baby girl
Sreeja and kalyan dhev

మెగాస్టార్ చిరంజీవి మళ్లీ తాతయ్య అయ్యాడు. చిరు చిన్న కూతురు శ్రీజ ఈరోజు పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. క్రిస్మస్ రోజున తమ ఇంట్లోకి ఆడపిల్ల రావడంతో మెగా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. శ్రీజ ని కళ్యాణ్ దేవ్ పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. అప్పటికే శ్రీజ కు ఒక కూతురు కాగా ఇప్పుడేమో మరో కూతురు పుట్టడంతో మెగా కుటుంబం ఆనందంతో పరవశించిపోతోంది. ఇక కళ్యాణ్ దేవ్ ఆనందానికి అంతే లేదు. తండ్రి అయ్యానన్న సంతోషంతో  తన కూతురి కాలి గుర్తుని ట్వీట్ చేసాడు కళ్యాణ్ దేవ్.

చిరంజీవి కి ఇద్దరు కూతుర్లు కాగా పెద్ద కూతురు సుస్మిత , చిన్న కూతురు శ్రీజ అన్న విషయం తెలిసిందే. ఇక చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా విజేత చిత్రంతో పరిచయం అయ్యాడు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు దాంతో కొంత గ్యాప్ తీసుకొని రెండో సినిమాకు రెడీ అవుతున్నాడు. మరి ఈ రెండో సినిమా తోనైనా హిట్ కొడతాడా చూడాలి . కూతురు వచ్చిన అదృష్టం కలిసి వస్తుందేమో ………

- Advertisement -

English Title: Chiru daughter blessed baby girl 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All