Homeటాప్ స్టోరీస్కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మెగా బ్రదర్స్

కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మెగా బ్రదర్స్

కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మెగా బ్రదర్స్
కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మెగా బ్రదర్స్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బర్త్ డే సంబరాలు జరుపుతున్నారు. అలాగే సినీ , రాజకీయ నేతలు కేసీఆర్ కు సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ట్వీట్టర్ వేదికగా కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. 68వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సీఎం కేసీఆర్ చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ ట్వీట్‌లో రాశారు.

తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపీ బండి సంజయ్ కూడా సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నిండూ నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆకాంక్షించారు. ఇక మెగా బ్రదర్స్ చిరంజీవి , పవన్ కళ్యాణ్ లు సైతం సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు  అందజేశారు.

- Advertisement -

గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కే సి ఆర్ గారికి హార్దిక జన్మ దిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో  వుండాలని, మీ లక్ష్యసాధనకి, ప్రజాసేవకి మీకు ఆ భగవంతుడు అపరిమిత శక్తి సామర్ధ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.. అంటూ చిరంజీవి తన ట్విట్టర్ లో అరుదైన ఫోటో షేర్ చేసి విషెష్ అందజేశారు. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రెస్ నోట్ ద్వారా కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. గొప్ప వాక్పటిమ, ముందుచూపు కలిగిన రాజకీయ పోరాట యోధుడు కేసీఆర్ . ఎంతటి జటిలమైన తెలంగాణమ రాష్ట్రానికి ఎదురైనా తన మాటలతో… వాక్చాతుర్యంతో ప్రజలకు స్వాంతన చేకూర్చడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన రాజకీయ ప్రయాణం, తెలంగాణ సాధనలో ఆయనదైన పోరాటం కేసీఆర్ గారిని తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలుపుతుంది. సమకాలీన రాజకీయ నాయకులలో తనకంటూ ఒక ప్రత్యేక పంథాను ఏర్పర్చుకోని రాజకీయ ప్రస్థానం కొనసాగించడం కేసీఆర్ గారిలోని మరో ప్రత్యేకత. ఆయన రాజకీయ శైలిని ప్రత్యర్థులు సైతం మెచ్చుకోకుండా ఉండలేరన్నది నిగూఢమైన నిజం. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ తోపాటు.. తెలంగాణ అంతట శాంతిభద్రతలు పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం విజ్ఞులందరితోపాటు నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. నూతన వసంతంలోకి అడుగిడుతున్న శుభ తరుణంలో కేసీఆర్ గారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ పవన్ ప్రెస్ నోట్ విడుదల చేసారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All