Homeటాప్ స్టోరీస్మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు అంటూ కేసీఆర్ కు విషెష్ అందించిన హరీష్ రావు

మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు అంటూ కేసీఆర్ కు విషెష్ అందించిన హరీష్ రావు

మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు అంటూ కేసీఆర్ కు విషెష్ అందించిన హరీష్ రావు
మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు అంటూ కేసీఆర్ కు విషెష్ అందించిన హరీష్ రావు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బర్త్ డే సంబరాలు జరుపుతున్నారు. నేతలు, కార్య కర్తలు , అభిమానులు పెద్ద ఎత్తున రక్త దానాలు , పండ్ల పంపిణి , పేదవారికి దుస్తుల పంపిణి చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మంత్రి హరీష్ రావు , ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ గొప్ప ఉద్యమకారుడు అని.. ఆయన పోరాటంతోనే తెలంగాణ సాధించుకున్నామని కొనియాడారు. కానీ కొంత మంది నాయకులు రక్తదాన శిబిరాలను రాజకీయం చేస్తున్నారంటూ విమర్శించారు.

- Advertisement -

దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల కేసీఆర్‌ వల్లే నెరవేరిందని, భావి తరాల బంగారు తెలంగాణ ఆయనవల్లే సాధ్యమవుతుందని అన్నారు. మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు అని తెలిపారు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నదిని ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఇక కేసీఆర్ కుమారుడు , మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ లో కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. నా నాయకుడు.. నా తండ్రి అని గర్వంగా చెప్పుకుంటానని .. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే అలవాటుగా మార్చుకున్నారని కొనియాడారు. దయతో నిండిన హృదయంతో అందరిని ముందుకు నడిపిస్తారని అన్నారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే సత్తా కేసీఆర్‌కు ఉందని తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All