Homeటాప్ స్టోరీస్ఈ యుద్ధంలో మ‌న‌మే గెలుస్తాం!

ఈ యుద్ధంలో మ‌న‌మే గెలుస్తాం!

ఈ యుద్ధంలో మ‌న‌మే గెలుస్తాం!
ఈ యుద్ధంలో మ‌న‌మే గెలుస్తాం!

కంటికి క‌నిపించ‌ని శ‌తృవుతో యుద్ధం చేస్తున్నాన‌ని త్ర‌విక్ర‌మ్ ఏ ముహూర్తాన రాసాడో కానీ ప్ర‌స్తుతం ప్ర‌పంచం మాత్రం ఆయ‌న చెప్పిన‌ట్టుగానే కంటికి క‌నిపించిన క‌రోనా వైర‌స్‌పై యుద్ధం చేస్తోంది. ప్ర‌జ‌ల్ని కాపాడ‌టం కోసం ఏకంగా లాక్ డౌన్‌నే ప్ర‌క‌టించేసింది. ప్ర‌పంచంలోని చాలా వ‌ర‌కు దేశాల్లో ఇప్ప‌టికే లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌లు వీధుల్లోకి కాకుండా క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేశారు.

మ‌న దేశంలో ఇప్పుడిప్పుడే దీని ధాటికి ఒక్కొక్క‌రుగా నెల‌కొరుగుతున్నారు. ఇప్ప‌టికే పాజిటివ్ కేసులు 600 దాటాయి. క‌రోనా ర‌క్క‌సిపై పోరుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంటే ఆ పోరులో మేము సైతం అంటూ సినీ సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు ఆర్థిక స‌హాయాన్ని ప్ర‌క‌టిస్తున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండు కోట్లు ప్ర‌క‌టిస్తే హీరో మ‌హేష్ కోటి రూపాయ‌ల ఆర్థిక స‌హాయాన్ని ప్ర‌క‌టించారు. ఓ సందేశాన్ని కూడా అందించారు.

- Advertisement -

జాతి మొత్తం కోవిడ్ 19పై యుద్ధం చేస్తోంది. ఈ సంద‌ర్భంగా అంద‌రూ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన రూల్స్‌ని పాటించాల‌ని ప్రార్థిస్తున్నాను. దేశ ప్ర‌ధాని, తెలంగాణ ప్ర‌భుత్వం, కేటీఆర్‌, ఏపీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్ క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం శ్ర‌మిస్తున్నారు. ఈ యుద్ధంలో మ‌నమే గెలుస్తాం. మాన‌వ‌త్వం అంద‌రిలోనూ పెరుగుతుంది. అంతా మంచే జ‌రుగుతుంది` అని ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశారు మ‌హేష్‌.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All