
చైనాలో పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది కరోనా వైరస్. దీని బారిన పడిన వారంతా చనిపోతుండటం, దీనికి చికిత్స అనేది పెద్దగా అందుబాటులో లేకపోవడంతో వరల్డ్ వైడ్‌గా మిలియనీర్స్ నుంచి సామాన్యుల వరకు భయంతో భీతిల్లిపోతున్నారు. బయటికి రావాలన్నా.. తెలిసిన వారితో, తెలియని వారితో.. పరిచయస్తులతో కరచాలనం చేయాలన్నా భయపడిపోతున్నారు. ఎక్కడ వైరస్ తెలియకుండానే తమని కబలించేస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
కరోనా వైరస్ హైదరాబాద్‌ని కూడా తాకింది. దీంతో ఇక్కడి వారంతా భయం గుప్పిట్లో బిక్కు బిక్కు మంటున్నారు. టర్కీ నుంచి వచ్చిన ఓ టెక్కీ హైదరాబాద్‌లోని రహెజా మైండ్ స్పేస్‌లోకి ఎంటరైంది. అయితే ఆ టెక్కీకి కరోనా వైరస్ సోకిందని అనుమానాలు తలెత్తడంతో ఉద్యోగులంతా భయాందోళనకు గురవుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన యాజమాన్యం మైండ్ స్పేస్ భవనాన్ని ఖాలీ చేసింది. ఉద్యోగులంతా వర్క్ ఇంటి నుంచే చేయోచ్చని ప్రకటించింది.
దీంతో ఉద్యోగులంతా ఆఫీస్‌ని ఖాలీచేయడం సంచలనం సృష్టిస్తోంది. దీనిపై టాలీవుడ్ హీరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అక్కినేని అఖిల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. `హైదరాబాద్‌లోని రహెజా మైండ్ స్పేస్ భవనం ఖాలీ అయిందని చదివాను. మీ పట్ల. మీ లోటి వార పట్ల జాగ్రత్తగా వుండండి. ఇది మనకు చాలా సీరియస్ సిట్చువేషన్. బీ కేర్ ఫుల్` అని ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
Just read about the evacuation of Raheja Mindspace building in Hyderabad. Please be careful everyone for your self and others around you. This is really serious now for us. Be safe and be well ! #CoronaAlert
— Akhil Akkineni (@AkhilAkkineni8) March 4, 2020
Credit: Twitter