Homeటాప్ స్టోరీస్ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్ఫూర్తితో మెగా ప‌వ‌ర్‌స్టార్‌..

ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్ఫూర్తితో మెగా ప‌వ‌ర్‌స్టార్‌..

ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్ఫూర్తితో మెగా ప‌వ‌ర్‌స్టార్‌..
ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్ఫూర్తితో మెగా ప‌వ‌ర్‌స్టార్‌..

క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా ప్ర‌పంచం అతాలాకుత‌లం అయిపోతోంది. ఎక్క‌డ చూసినా వంద‌ల్లో వేల‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌విస్తుండ‌టంతో దేశాల‌న్నీ అప్ప‌మ‌త్త‌మై క‌రోనా క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. దేశ వ్యాప్తంగా అల‌ర్ట్‌ని ప్ర‌క‌టించి నివార‌ణ చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఇప్ప‌టికే మ‌న దేశంలో లాక్ డౌన్ ని ప్ర‌క‌టించారు. కేంద్ర తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా పాటిస్తున్నాయి. ఈ క్ర‌మంలో త‌మ వంతు బాధ్య‌త‌గా సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు స్వ‌చ్ఛందంగా క‌రోరా క‌ట్ట‌డికి ఆర్థిక స‌హాయాన్ని ప్ర‌క‌టిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సీఎం రిలీఫ్ ఫండ్‌కు హీరో నితిన్ 20 ల‌క్ష‌లు ప్ర‌క‌టించి ఈ సంప్ర‌దాయానికి తెర లేపిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ రోజు (గురువారం) ఉద‌యం జన‌సేన అధినేత, స్టార్ హీరో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కేంద్రంతో పాటు ఉభ‌య తెలుగు రాష్ట్రాల సీఎంల స‌హాయ నిధికి అక్ష‌రాల రెండు కోట్ల ఆర్థిక స‌హాయాన్ని ప్ర‌క‌టించి త‌న గొప్ప మ‌న‌సును చాటుకున్నారు.

- Advertisement -

ఇదిలా వుంటే త‌న బాబాయ్ ఇచ్చిన స్ఫూర్తితో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తాజాగా 70 ల‌క్ష‌లు ఆర్థిక స‌హాయాన్ని ప్ర‌క‌టించారు. ఇందులో కేంద్ర ప్ర‌భుత్వానికి, ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌కు ఈ ఆర్థిక స‌హాయాన్ని అందించ‌నున్నార‌ట‌. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారి ట్వీట్ స్ఫూర్తినిచ్చింది. త‌న వంతుగా 70 ల‌క్ష‌లు అందిస్తున్నానని. ఇందులో కొంత సెంట‌ర్‌కు, కొంత ఉభ‌య తెలుగు రాష్ట్రాల స‌హాయ‌నిధికి అంద‌జేస్తాన‌ని రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌క‌టించారు. క‌రోనా క‌ట్ట‌డి కోసం కేంద్రంతో పాటు ఉభ‌య తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు, వైఎస్ జ‌గ‌న్‌గారు తీసుకుంటున్న‌నిర్ణ‌యాల‌కు అంతా క‌ట్టుబ‌డి వుండాల‌ని ఈ సంద‌ర్భంగా కోర‌డం విశేషం.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All