Homeటాప్ స్టోరీస్తెలంగాణలో మహాకూటమిదే విజయం

తెలంగాణలో మహాకూటమిదే విజయం

Mahakutami gets power in telangana :C voter surveyతెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘోరంగా ఓడిపోవడం ఖాయమని , అధికారం చేపట్టేది మహాకూటమి అని సీ ఓటర్ సర్వే తేల్చి చెప్పింది. ఇంతకుముందు కొంగర కలాన్ సభకు ముందు ఇదే సీ ఓటర్ సంస్థ చెప్పిన సర్వే ప్రకారం తెలంగాణలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు. అయితే తాజా సర్వే ప్రకారం కేసీఆర్ పార్టీ ఘోరంగా ఓడిపోయి కాంగ్రెస్-టిడిపి నేతృత్వంలోని మహాకూటమి అధికార పగ్గాలు చేపడుతుందని సర్వే ప్రకటించింది. సీ ఓటర్ సర్వే ప్రకారం మహాకూటమికి 64 స్థానాలు , టీఆర్ఎస్ కు 42 స్థానాలు , బీజేపీ కి 4 , ఇతరులు 9 స్థానాల్లో విజయం సాధిస్తారని ప్రకటించింది సీ ఓటర్.

- Advertisement -

సీ ఓటర్ సర్వే లో మహాకూటమిదే విజయం అని తేలడంతో కాంగ్రెస్ , టీడీపీ నాయకులు , కార్యకర్తలు మరింత జోష్ తో పనిచేయడం ఖాయం . తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అలాగే తెలుగుదేశం పార్టీకి గణనీయంగా ఓటు బ్యాంకు ఉంది. పైగా ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఒక్కటిగా పోరాడుతున్నాయి దాంతో కూటమి విజయం ఖాయమని ధీమాగా ఉన్నారు. అయితే గతకొంత కాలంగా తెలంగాణలో ప్రతిపక్షాలు అనేవి లేకుండా కాంగ్రెస్ , టిడిపి లను నిర్వీర్యం చేసాడు కేసీఆర్. అయినప్పటికీ లోలోన మాత్రం మహాకూటమి పట్ల కేసీఆర్ కు , కేటీఆర్ కు భయం పట్టుకుంది. అందుకే మహాకూటమిని , చంద్రబాబుని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.

English Title:  Mahakutami gets power in telangana :C voter survey

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts