Homeటాప్ స్టోరీస్బాలయ్య మాటని లెక్కచేయని కళ్యాణ్ రామ్

బాలయ్య మాటని లెక్కచేయని కళ్యాణ్ రామ్

Nandamuri kalyan ram rejected balakrshna's offerనటసింహం నందమూరి బాలకృష్ణ కళ్యాణ్ రామ్ కు ఇచ్చిన సలహా నచ్చలేదు దాంతో బాలయ్య బాబాయ్ చెబుతున్నాడు అని ఆలోచించకుండా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాడు . బాబాయ్ అంటే నాన్న తర్వాత నాన్న లాంటి వాడు పైగా ఇటీవలే నందమూరి హరికృష్ణ చనిపోయాడు కాబట్టి పెద్ద తరహాలో కళ్యాణ్ రామ్ కు సలహా ఇచ్చాడట కానీ కళ్యాణ్ రామ్ మాత్రం అందుకు ససేమిరా అనడంతో బాలయ్య చేసేదేమి లేక మిన్నకుండి పోయాడట ! ఇంతకీ బాలయ్య ఇచ్చిన సలహా ఏంటి ? కళ్యాణ్ రామ్ ఎందుకు రిజెక్ట్ చేసాడో తెలుసా …….. కళ్యాణ్ రామ్ ని రాజకీయాల్లోకి రమ్మని , తెలుగుదేశం పార్టీ తరుపున హైదరాబాద్ లో పోటీ చేయమని సలహా ఇచ్చాడు బాలయ్య , అయితే ఇప్పుడే రాజకీయాల్లోకి రావాలనే ఆశ లేదని …… బాలయ్య బాబాయ్ ఇచ్చిన ఆఫర్ ని రిజెక్ట్ చేసాడు కళ్యాణ్ రామ్ .

నందమూరి కళ్యాణ్ రామ్ ఒకవైపు సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు హీరోగా నటిస్తున్నాడు . అయితే సినిమారంగంలో ఓ స్టార్ హీరోగా వెలుగొందాలని ఆశించాడు కానీ ఆ ఆశ నెరవేరలేదు దాంతో గమ్మున ఉండకుండా పోరాటం చేస్తూనే ఉన్నాడు . మరో పదేళ్ల పాటు సినిమాలు చేస్తానని , ఆ తర్వాతే రాజకీయాల గురించి ఆలోచిస్తానని చెప్పాడట బాలయ్య బాబాయ్ కి . తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి గడ్డు రోజులు వచ్చాయి , దాంతో పార్టీని బ్రతికించడం కోసం బాలయ్య , చంద్రబాబు లు కష్టపడుతున్నారు . అందులో భాగంగానే కళ్యాణ్ రామ్ ని హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లేదా కూకట్ పల్లి తదితర ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయమని కోరితే నిరాకరించాడట . గ్రేటర్ హైదరాబాద్ లోని 28 నియోజక వర్గాల్లో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉంది , గత ఎన్నికల్లో గ్రేటర్ లోనే 11 స్థానాల్లో టిడిపి గెలిచింది . ఈసారి కూడా టిడిపి పట్టు కోసం కాంగ్రెస్ తో జతకట్టి మహాకూటమిగా ఏర్పడి పోటీకి పలు అభ్యర్థులను నిలబెడుతోంది .

- Advertisement -

English Title: Nandamuri kalyan ram rejected balakrshna’s offer

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All