Homeటాప్ స్టోరీస్భారీ యాక్సిడెంట్ లో చనిపోయిన నందమూరి హరికృష్ణ

భారీ యాక్సిడెంట్ లో చనిపోయిన నందమూరి హరికృష్ణ

nandamuri harikrishna dead in road accidentనందమూరి హరికృష్ణ( 61) రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు . హరికృష్ణ మరణవార్త విన్న ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతూ హుటాహుటినా ఆసుపత్రికి తరలివెళ్లారు . ఓ పెళ్లి వేడుకలో పాల్గొనడానికి ఈరోజు తెల్లవారు ఝామున హైదరాబాద్ నుండి బయలుదేరాడు నందమూరి హరికృష్ణ . అయితే నల్లగొండ జిల్లా అన్నెపర్తి వద్ద కారు అదుపుతప్పడంతో డివైడర్ ని దాటి మరో కారుని డీ కొట్టడంతో హరికృష్ణ తలకు తీవ్ర గాయాలయ్యాయి దాంతో హరికృష్ణ ని నార్కట్ పల్లి లోని కామినేని ఆసుపత్రికి తరలించారు , అయితే డాక్టర్లు హరికృష్ణ ని బ్రతికించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ తలకు తీవ్ర గాయాలు కావడంతో ఫలితం లేకుండా పోయింది .

ఈరోజు ఉదయం 7 గంటలకు హరికృష్ణ చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు . హరికృష్ణ మృతి తో నందమూరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది . హరికృష్ణ కు ఇద్దరు భార్యలు కాగా ముగ్గురు కొడుకులు , ఒక కుమార్తె ఉన్నారు . అయితే మూడేళ్ళ క్రితమే హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ ఇదే రోడ్డు ప్రమాదంలో మరణించగా , నందమూరి హరికృష్ణ కూడా అదే ప్రమాదంలో మరణించడం విషాదకరంగా మారింది .

- Advertisement -

English Title: nandamuri harikrishna dead in road accident

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All