Homeన్యూస్బిగ్ బాస్ 5: ఈ వారం డేంజర్ జోన్ లో ఉంది ఎవరు?

బిగ్ బాస్ 5: ఈ వారం డేంజర్ జోన్ లో ఉంది ఎవరు?

బిగ్ బాస్ 5: ఈ వారం డేంజర్ జోన్ లో ఉంది ఎవరు?
బిగ్ బాస్ 5: ఈ వారం డేంజర్ జోన్ లో ఉంది ఎవరు?

బిగ్ బాస్ సీజన్ 5 ఆసక్తికరంగా నడుస్తోంది. ఇప్పటికే హౌజ్ నుండి తొమ్మిది మంది ఎలిమినేట్ కాగా ఇంకా హౌజ్ లో 10 మంది ఉన్నారు. అయితే ఈరోజు హౌజ్ నుండి జెస్సీ అనారోగ్యం కారణంగా వెళ్ళిపోతున్నాడు. మరి తను ఎలిమినేట్ అవుతాడా లేక మళ్ళీ హౌజ్ లోకి వస్తాడా అన్న విషయంలో ఎటువంటి క్లారిటీ లేదు.

ఇదిలా ఉంటే ఈ వారం నామినేషన్స్ అత్యంత ఆసక్తికరంగా నడిచాయి. ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయిన సభ్యులు మానస్, సన్నీ, కాజల్, సిరి, రవి. ఈ ఐదుగురు కూడా స్ట్రాంగ్ ప్లేయర్స్. కాకపోతే రీసెంట్ గా గేమ్ చూసుకుంటే మాత్రం మానస్, కాజల్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు అర్ధమవుతోంది.

- Advertisement -

మానస్, సన్నీ, కాజల్ ఒక గ్రూప్ గా కొంత కాలం నుండి ఉంటున్నారు. అయితే నామినేషన్స్ లో కాజల్ చేసిన తప్పు కారణంగా ఈ ముగ్గురూ కూడా నామినేషన్స్ లో ఉండాల్సి వచ్చింది. ఈ గ్రూప్ ను అభిమానించే వారు ఇప్పుడు ఓట్లను డివైడ్ చేయాల్సి వస్తోంది. కానీ సన్నీకి ఈ విషయంలో ఎలాంటి డేంజర్ ఉండకపోవచ్చు.

ఎందుకంటే అటు కామెడీ పరంగా కానీ లేదా గొడవల పరంగా కానీ సన్నీకు ఎక్కువ స్క్రీన్ టైమ్ దక్కుతోంది. అయితే ఎక్కువగా కామ్ గా ఉండే మానస్, ఎక్కువగా అందరికీ నచ్చని కాజల్ లకు ఈ వారం డేంజర్ తప్పేలా లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All