Homeన్యూస్కాజల్ స్థానంలో నాగ్ హీరోయిన్ గా అమలా పాల్

కాజల్ స్థానంలో నాగ్ హీరోయిన్ గా అమలా పాల్

కాజల్ స్థానంలో నాగ్ హీరోయిన్ గా అమలా పాల్
కాజల్ స్థానంలో నాగ్ హీరోయిన్ గా అమలా పాల్

అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఘోస్ట్ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే. ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను ఫైనల్ చేసారు. షూటింగ్ కూడా మొదలైంది. నాగార్జునతో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసారు. అయితే అనివార్య కారణాల వల్ల కాజల్ అగర్వాల్ సినిమా నుండి తప్పుకుంది. ఆమె గర్భవతి కావడంతోనే తప్పుకుందని తెలుస్తోంది. గతేడాది కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు వివాహం జరిగిన విషయం తెల్సిందే.

ఆ తర్వాత కొంత కాలం బ్రేక్ తీసుకుని మళ్ళీ సినిమాలను చేయడం కొనసాగించింది కాజల్. ఆచార్యను పూర్తి చేసింది. ఈ క్రమంలోనే ఘోస్ట్ ను కూడా ఓకే చేసింది. అయితే ఈలోగా ప్రెగ్నంట్ కావడంతో దంపతులు ఇద్దరూ దాన్ని కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నారు. దీంతో కాజల్ సినిమాల కమిట్మెంట్స్ అన్నీ వదులుకుంది.

- Advertisement -

కాజల్ తప్పుకోవడంతో ఘోస్ట్ నిర్మాతలు చాలా మంది హీరోయిన్లను అప్రోచ్ అయ్యారు కానీ వివిధ కారణాల వల్ల ఎవరూ వర్కౌట్ కాలేదు. కొంత మందికి డేట్స్ సమస్య అయితే మరికొంత మందికి రెమ్యునరేషన్స్ ప్రాబ్లెమ్. అయితే మొత్తానికి కాజల్ స్థానాన్ని అమలా పాల్ భర్తీ చేసినట్లు తెలుస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో సరైన ఆఫర్ కోసం ఎదురుచూస్తోంది అమలా. ఘోస్ట్ చిత్రం ఆమెకు సరైన ఛాయస్ అని చెప్పవచ్చు. త్వరలోనే సెట్స్ లో జాయిన్ అవుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All