Homeటాప్ స్టోరీస్మహేష్ సినిమాలో నటించనని చెప్పా : ఇలియానా

మహేష్ సినిమాలో నటించనని చెప్పా : ఇలియానా

Ileana sensational comments on mahesh's pokiri పోకిరి చిత్రంలో మహేష్ బాబు సరసన ఇలియానా నటించిన విషయం తెలిసిందే . ఆ సినిమా మహేష్ కెరీర్ ని మలుపు తిప్పింది ఇక ఇలియానా కు ఇప్పటివరకు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే వన్ అండ్ ఓన్లీ పోకిరి . కానీ అలాంటి చిత్రంలో నటించే చాన్స్ వస్తే ఏమాత్రం ఆలోచించకుండా ముందు నో అనేసిందట ! ఆ కథ ఏంటి ? క్యారెక్టర్ ఏంటి ? ఈ సినిమా అసలు ఆడుతుందా ? అంటూ అనుమానం వ్యక్తం చేయడంతో మహేష్ సోదరి మంజుల ఇలియానా కు బ్రెయిన్ వాష్ చేసిందట ! మాస్ కి ఎక్కే సినిమా కాబట్టి తప్పకుండా హిట్ అవుతుంది నన్ను నమ్మి ఈ సినిమా చేయమని కోరిందట !

దాంతో అన్యమనస్కంగానే పోకిరి సినిమాలో నటించింది . కట్ చేస్తే పోకిరి చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో కొత్తగా చెప్పాల్సింది ఏముంది . మహేష్ కెరీర్ తో పాటుగా ఇలియానా కెరీర్ లో మైలురాయిగా నిలిచింది . ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతుందంటే ఒక్కోసారి మనం ఏదో అనుకుంటాం కానీ ఇంకేదో అవుతుంది . ఇక ఇప్పుడు అమర్ అక్బర్ ఆంటోనీ నాకు సరైన రీ ఎంట్రీ అని అంటోంది ఇలియానా . ఈనెల 16 న అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం విడుదల అవుతోంది .

- Advertisement -

English Title: Ileana sensational comments on mahesh’s pokiri

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All