Homeటాప్ స్టోరీస్ఈ 18 ఏళ్లలో చరిత్ర సృష్టించిన చిత్రాలు

ఈ 18 ఏళ్లలో చరిత్ర సృష్టించిన చిత్రాలు

Tollywood highest grossersతెలుగు చలనచిత్ర చరిత్రలో ప్రభంజనం సృష్టించిన చిత్రాలు ఎన్నో ఎన్నెన్నో ….. అయితే ఇప్పటికి కూడా చరిత్ర గా నిలిచిపోయిన చిత్రాలు మాత్రం తక్కువే ! అలాంటి చిత్రాల్లో కొన్ని .

1) 2001 లో విడుదలైన నరసింహనాయుడు ప్రపంచ వ్యాప్తంగా 32. 4 కోట్లు వసూల్ చేసి చరిత్ర సృష్టించింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రానికి బి. గోపాల్ దర్శకత్వం వహించాడు.

- Advertisement -

2) 2002 లో విడుదలైన ఇంద్ర 32 కోట్లతో ఘన విజయం సాధించింది. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రానికి బి. గోపాల్ దర్శకత్వం వహించడం విశేషం .

3) 2003 లో విడుదలైన ఠాగూర్ 36 కోట్లతో సంచలన విజయం సాధించింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా వివివినాయక్ దర్శకత్వం వహించాడు.

4) శంకర్ దాదా MBBS 2004 లో విడుదలైన ఈ చిత్రం 45 కోట్ల వసూళ్ల ని సాధించడం విశేషం . హీరో మెగాస్టార్ చిరంజీవి కాగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కింది.
2006 లో విడుదలైన పోకిరి 66 కోట్ల వసూళ్ల తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. మహేష్ బాబు హీరో కాగా పూరి జగన్నాధ్ దర్శకుడు.

5) 2009 లో విడుదలైన మగధీర వసూళ్ల సునామీ సృష్టించింది తెలుగునాట ! ఒక తెలుగు సినిమాకు ఇంతటి ప్రభంజనం వీలు అవుతుందా ? ఇది నిజమేనా అన్నట్లుగా సాగింది మగధీర సంచలనం . 140 కోట్ల గ్రాస్ వసూళ్ల తో చరిత్ర సృష్టించింది . ఇక ఈ చిత్రంలో రాంచరణ్ హీరోగా నటించగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు .

6) 2010 లో విడుదలైన సింహా చిత్రం నందమూరి బాలకృష్ణ కు తిరుగులేని విజయాన్ని అందించడమే కాకుండా అంతకుముందు వరుస ప్లాప్ లతో ఇక కెరీర్ ముగిసిందా అని అనుకుంటున్న తరుణంలో సింహా చిత్రంతో మరోసారి జూలు విదిల్చాడు బాలయ్య . బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు ఈ చిత్రానికి .

7) 2011 లో విడుదలైన దూకుడు మహేష్ కెరీర్ కు సరికొత్త ఊపునిచ్చింది . పోకిరి తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ బ్లాక్ బస్టర్ అన్నది లేకుండా పోయిందే , చాలాకాలం అవుతుందే అని అనుకుంటున్న సమయంలో 101 కోట్ల వసూళ్ల తో దూకుడు ప్రభంజనం సృష్టించింది . శ్రీను వైట్ల దర్శకుడు

8) 2012 లో విడుదలైన గబ్బర్ సింగ్ 104 కోట్ల తో మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా తగ్గలేదని నిరూపించిన చిత్రం ఈ గబ్బర్ సింగ్ . హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో ప్లాప్ లతో సతమతం అవుతున్న పవన్ కళ్యాణ్ కు తిరుగులేని హిట్ నిచ్చింది .

9) గబ్బర్ సింగ్ ఇచ్చిన జోష్ తో ప్రతికూల పరిస్థితిలో సైతం విడుదలైన చిత్రం ”అత్తారింటికి దారేది ” . 2013 లో విడుదలైన ఈ చిత్రం 130 కోట్ల గ్రాస్ వసూళ్ల తో సరికొత్త చరిత్ర సృష్టించింది . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ చిత్రం .

10 ) 2014 లో విడుదలైన రేసు గుర్రం 102 కోట్లతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది . అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు .

11) 2015 లో వచ్చిన బాహుబలి తో ఒక్కసారిగా తెలుగు సినిమా చరిత్ర గతినే మార్చింది . 602 కోట్ల భారీ వసూళ్ల ని సాధించి తెలుగు సినిమాకు ఇంతటి స్టామినా ఉందా ? అని ఆశ్చర్యానికి గురిచేసిన చిత్రం బాహుబలి . ప్రభాస్, రానా , రమ్యకృష్ణ , అనుష్క తదితరులు నటించగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు .

12) 2016 లో విడుదలైన జనతా గ్యారేజ్ 125 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది . ఎన్టీఆర్ కెరీర్ లోనే నెంబర్ వన్ చిత్రంగా నిలిచినా ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించాడు .

13) 2017 లో విడుదలైన బాహుబలి 2 వసూళ్ల సునామి సృష్టించింది . ప్రపంచ వ్యాప్తంగా 1700 కోట్ల వసూళ్ల తో దేశం లోనే అత్యధిక వసూళ్లని సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది . ఇక ఈ చిత్రానికి కూడా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు .

14 ) 2018 లో వేసవిలో విడుదలైన రంగస్థలం 1980 నాటి కాలాన్ని గుర్తుకు తెస్తూ సంచలన విజయం సాధించింది . 214 కోట్ల వసూళ్ల తో రాంచరణ్ కెరీర్ లో మరో మైలురాయి గా నిలిచింది రంగస్థలం . సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది .

English Title: tollywood highest grossers

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All