Homeటాప్ స్టోరీస్లావెక్కిన ఇలియానా - లావు తగ్గుతానంటున్న నిత్యామీనన్

లావెక్కిన ఇలియానా – లావు తగ్గుతానంటున్న నిత్యామీనన్

Ileana gain nithya menon eyes on thinనిన్న మొన్నటి వరకు జీరో సైజ్ అందాలతో రాణించిన ఇలియానా ఒక్కసారిగా ఫిట్ నెస్ ని వదిలేసి లావెక్కి పిచ్చ షాక్ ఇచ్చింది . గోవా భామ ఇలియానా లావుగా కనిపించడంతో షాక్ అయ్యారు జనాలు . ఇక ఇలియానా ని బాగా ఇష్టపడే కుర్రకారు గురించి కొత్తగా చెప్పాలా ? అసలు చూస్తున్నది ఇలియానానేనా ? లేక ఇంకెవరైనానా ? అంటూ నోరెళ్ళ బెట్టి మరీ ఇలియానాని చూస్తుండి పోయారు నిన్నటి అమర్ అక్బర్ ఆంటోనీ వేడుకలో . టాలీవుడ్ లో సినిమాలు మానేసి బాలీవుడ్ కెళ్ళిన ఈ భామ సినిమాల సంగతి పక్కన పెట్టి ఆండ్రూ తో ఎంజాయ్ చేస్తూ లావెక్కింది .

ఇక ఇలియానా సంగతి అలా ఉండగా నిత్యామీనన్ ది మరో రకమైన సమస్య అయి కూర్చుంది . అసలే పొడవు తక్కువ కావడంతో నిత్యామీనన్ లావుగా కనిపిస్తుంది దానికి తోడూ ఈమధ్య మరీ లావు ఎక్కువయ్యింది దాంతో లావు తగ్గమని అదేపనిగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు నెటిజనులు నిత్యా మీనన్ ని . అయితే అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు కానీ ఈమధ్య బాలీవుడ్ చిత్రంలో చాన్స్ వచ్చేసరికి లావు తగ్గాలని డిసైడ్ అయ్యిందట . ఇప్పుడే కసరత్తులు స్టార్ట్ చేసిందట అంటే మరో రెండు నెలల్లో నిత్యా మీనన్ సన్నగా కనిపించడం ఖాయమే కావచ్చు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All