Homeటాప్ స్టోరీస్మహేష్ బాబు మహర్షి కూడా ప్లాప్ అవుతుందా ?

మహేష్ బాబు మహర్షి కూడా ప్లాప్ అవుతుందా ?

Mahesh babu maharshiటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . దిల్ రాజు , అశ్వనీదత్ , పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన ఐరన్ లెగ్ భామ పూజా హెగ్డే నటిస్తోంది . దాంతో మహేష్ బాబు మహర్షి కూడా ప్లాప్ జాబితాలో చేరడం ఖాయమని ఎందుకంటే ఐరన్ లెగ్ పూజా హెగ్డే నటిస్తోంది కాబట్టి అంటూ అప్పుడే పలువురు సినీ అభిమానులు పందాలు కాస్తున్నారు . ఇంతగా వీళ్ళు రకరకాల మాటలు అనడానికి కారణం ఏంటో తెలుసా …….. పూజా హెగ్డే . పాపం ఈ భామ నటించిన చిత్రాలన్నీ భారీ చిత్రాలే కానీ భారీ విజయాలు సాధించిన చిత్రాలు అయితే లేవు .

ఇప్పటివరకు ఈ భామ టాలీవుడ్ లో ఆరు చిత్రాల్లో నటించగా మూడు చిత్రాలు అయితే పక్కాగా డిజాస్టర్ లు అయ్యాయి . ముకుంద , ఒక లైలా కోసం , సాక్ష్యం చిత్రాలు ప్లాప్ కాగా , దువ్వాడ జగన్నాథం ,అరవింద సమేత చిత్రాలు భారీ ఓపెనింగ్స్ సాధించాయి కానీ బయ్యర్లు నష్టపోయారు దాంతో అవి కూడా ఈ భామకు కలిసి రాలేదు . ఇక ఒక్క చిత్రమే బ్లాక్ బస్టర్ అది రంగస్థలం చిత్రం . అయితే ఆ చిత్రంలో కేవలం ఐటెం సాంగ్ మాత్రమే చేసింది కాబట్టి ఈ భామ ఖాతాలో ఆ సక్సెస్ వేయలేం . దాంతో పూజా హెగ్డే అంటే ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది దాంతో మహేష్ బాబు నటిస్తున్న మహర్షి చిత్రం కూడా ప్లాప్ జాబితాలో చేరడం ఖాయమని కొత్త వాదన చేస్తున్నారు పలువురు . ఏంటో ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్ . మరి ఈ వాదన నిజమౌతుందా ? లేక పూజా హెగ్డే బ్రేక్ చేస్తుందా ? అన్నది తెలియాలంటే 2019 ఏప్రిల్ వరకు అంటే మహర్షి విడుదల అయ్యేంత వరకు ఎదురు చూడాల్సిందే .

- Advertisement -

English Title: Mahesh babu maharshi result in dilemma

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All