Homeటాప్ స్టోరీస్దిల్ రాజుతో విబేదిస్తున్న మహేష్ బాబు

దిల్ రాజుతో విబేదిస్తున్న మహేష్ బాబు

Differences between mahesh babu and dil raju అగ్ర నిర్మాత దిల్ రాజు తో విబేదిస్తున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు . తాజాగా మహేష్ బాబు హీరోగా మహర్షి అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథానుగుణంగా రెండు ఫైట్లు మాత్రమే ఉన్నాయట ! దాంతో ఆ రెండు ఫైట్లకు తోడూ మరో రెండు ఫైట్లు జోడించమని హీరోని , దర్శకుడిని కోరుతున్నాడట దిల్ రాజు . ఎందుకయ్యా ఈ కోరిక అంటే హిందీ రైట్స్ అమ్ముకోవడానికి . హిందీలో ఫైట్స్ ఎక్కువగా ఉంటే మంచి బేరం కుదురుతోంది , ఫైట్స్ తక్కువగా ఉంటే అంతగా డిమాండ్ లేదు దాంతో మరో రెండు ఫైట్ల ని జోడించమని కోరుతున్నాడు దిల్ రాజు . దానికి మహేష్ ససేమిరా అంటున్నాడట .

కథకు అవసరమైన చోట ఫైట్స్ ఉండాలి కానీ హిందీ రైట్స్ కోసం ఫైట్స్ పెట్టడం ఏంటి ? అని దిల్ రాజు తో విభేదిస్తున్నాడట మహేష్ బాబు . పైగా ఈమధ్య దిల్ రాజు నిర్మించిన చిత్రాలన్నీ వరుసగా ఫ్లాప్ కావడంతో పాపం ఈ నిర్మాత మాటలకు విలువ లేకుండా పోయింది . సినిమాలు హిట్ అయితే దిల్ రాజు జడ్జిమెంట్ కరెక్ట్ అంటూ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కానీ ఇతగాడు తీస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టి అతడి మాటలకు విలువ లేకుండా పోయింది . ఈ ఏడాది దిల్ రాజు నిర్మించిన మూడు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి మరి .

- Advertisement -

English Title: Differences between mahesh babu and dil raju

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All