Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్ఫ్లాప్ లలో హ్యాట్రిక్ కొట్టిన దిల్ రాజు

ఫ్లాప్ లలో హ్యాట్రిక్ కొట్టిన దిల్ రాజు

Dil raju gets hattric flopsఈ ఏడాది ద్వితీయార్ధం అగ్ర నిర్మాత దిల్ రాజుకు అస్సలు బాగోలేదు అందుకే అతడు నిర్మించిన మూడు చిత్రాలు వరుసగా డిజాస్టర్ ల మీద డిజాస్టర్ లు అయ్యాయి . రాజ్ తరుణ్ తో చేసిన లవర్ జూలై లో విడుదలై ఘోర పరాజయం మూటగట్టుకుంది . దాని తర్వాత నితిన్ హీరోగా నిర్మించిన శ్రీనివాస కళ్యాణం కూడా విడుదలై ఘోర పరాజయం పొందింది . కట్ చేస్తే ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా హలో గురూ ప్రేమకోసమే చిత్రం కూడా ఫ్లాప్ జాబితాలో చేరిపోయింది . దసరా సెలవుల పుణ్యమా అని ఈ మాత్రం వసూళ్లు వచ్చాయి లేదంటే హలో గురూ ప్రేమకోసమే చిత్రం కూడా డిజాస్టర్ అయ్యేది .

- Advertisement -

25 కోట్ల బిజినెస్ చేసిన హలో గురూ ప్రేమకోసమే చిత్రానికి ఇప్పటివరకు దాదాపుగా 18 కోట్ల షేర్ వచ్చింది దసరా సెలవులు కాబట్టి . ఇక సెలవులు అయిపోవడంతో వసూళ్లు లేవు దాంతో సక్సెస్ టూర్ అంటూ బయలుదేరారు . హీరో , హీరోయిన్ లు వస్తున్నారని తెలిసినా , ప్రచారం చేసినా ప్రేక్షకులు వాళ్ళని చూడటానికి ఎగబడుతున్నారు తప్పితే టికెట్ కొని సినిమా మాత్రం చూడటం లేదు దాంతో హ్యాట్రిక్ ఫ్లాప్ చిత్రాలను మూట గట్టుకున్నాడు దిల్ రాజు . గత ఏడాది వరుసగా ఆరు చిత్రాలను హిట్ చేసి పండగ చేసుకున్న దిల్ రాజు కు ఈ ఏడాది వరుసగా మూడు ఫ్లాప్ లు రావడం గమనార్హం .

English Title: Dil raju gets hattric flops

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts