Homeటాప్ స్టోరీస్లవర్ రివ్యూ

లవర్ రివ్యూ

Lover Movie Review Ratingలవర్ రివ్యూ :
నటీనటులు : రాజ్ తరుణ్ , రిద్ది కుమార్
ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి
నిర్మాత : హర్షిత్ రెడ్డి
దర్శకత్వం : అనీష్ కృష్ణ
రేటింగ్ : 2. 5/ 5
రిలీజ్ డేట్ : 20 జూలై 2018

వరుస పరాజయాలను అందుకుంటున్న రాజ్ తరుణ్ హీరోగా నటించిన లవర్ ఈరోజు విడుదల అయ్యింది . దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

- Advertisement -

కొత్త కొత్త బైక్స్ ని డిజైన్ చేసే రాజ్ ( రాజ్ తరుణ్ ) బ్యాంకాక్ వెళ్తున్న సమయంలో చేతికి గాయమై ఆసుపత్రిలో చేరతాడు , ఆ హాస్పిటల్ లో ని నర్స్ చరిత (రిద్ది కుమార్ )ని చూసి ప్రేమలో పడతాడు . రాజ్ ప్రేమని చరిత పట్టించుకోదు , అయితే రాజ్ చేసిన మంచి పని వల్ల చరిత రాజ్ ని ప్రేమిస్తుంది . ప్రేమ సుఖాంతం అయ్యింది అనుకునే లోపున ఓ గ్యాంగ్ చరిత ని అంతం చేయడానికి వస్తుంది . అసలు చరిత ఎవరు ? ఆమెని చంపడానికి వచ్చిన గ్యాంగ్ ఎవరు ? చివరకు ఆ గ్యాంగ్ నుండి తన ప్రేయసి ని రాజ్ కాపాడుకున్నాడా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

ఫస్టాఫ్
రాజ్ తరుణ్ చిత్తూర్ యాస
రిద్ది కుమార్ గ్లామర్

డ్రా బ్యాక్స్ :

సెకండాఫ్
స్క్రీన్ ప్లే

నటీనటుల ప్రతిభ :

రాజ్ తరుణ్ చిత్తూర్ యాస ఆకట్టుకునేలా ఉంది , అలాగే గెటప్ పరంగా కూడా జాగ్రత్తలు తీసుకున్నాడు రాజ్ తరుణ్ . తన టైమింగ్స్ తో కొన్ని చోట్ల ఆకట్టుకున్నాడు . ఇక హీరోయిన్ రిద్ది కుమార్ నాకు నటన కంటే గ్లామర్ కే ఎక్కువ స్కోప్ ఉంది . రాజ్ తరుణ్ – రిద్ది కుమార్ ల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ఫరవాలేదు . సత్యం రాజేష్ – సత్య కామెడీతో అలరించారు , రాజీవ్ కనకాల కు మంచి పాత్ర లభించింది . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు నటించారు .

సాంకేతిక వర్గం :

ఈ సినిమాకు అయిదుగురు సంగీత దర్శకులు పని చేయడం విశేషం , అయిదుగురు అందించిన పాటలు బాగున్నాయి . సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . నిర్మాణ విలువలు బాగున్నాయి , ఇక దర్శకుడు అనీష్ కృష్ణ విషయానికి వస్తే ……. ఫస్టాఫ్ ని ఎంటర్ టైన్ మెంట్ తో అలరించిన అనీష్ కృష్ణ సెకండాఫ్ కు వచ్చేసరికి పూర్తిస్థాయిలో రాణించలేక పోయాడు . దాంతో సెకండాఫ్ లో సాగతీత సన్నివేశాలు ఎక్కువయ్యాయి .

ఓవరాల్ గా :

ఫస్టాఫ్ బాగానే ఉన్నప్పటికీ సెకండాఫ్ కు వచ్చేసరికి స్క్రీన్ ప్లే పరంగా ఆకట్టుకోలేక పోయాడు దర్శకుడు దాంతో ఈ లవర్ ని ఆస్వాదించడం కష్టమే !

English Title: lover movie review rating

                            Click here for English Review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All