Homeటాప్ స్టోరీస్మహేష్ బాబు కు అవమానమే అది

మహేష్ బాబు కు అవమానమే అది

shocking :NO craze for mahesh in americaటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు అవమానం జరిగింది . నేరుగా కాకపోయినా ఇది ఖచ్చితంగా మహేష్ క్రేజ్ కు అవమానమే . ఇంతకీ అసలు విషయం ఏంటంటే …….. మహేష్ బాబు ని గెస్ట్ గా పిలిచి ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టాలని అమెరికాలో ఓ సంస్థ భావించింది . మహేష్ కు అమెరికాలో ఏనలేని క్రేజ్ ఉంది దాంతో టికెట్ రేటు ఏకంగా 2 వేల డాలర్లుగా పెట్టారు అయితే భారీ మొత్తం కావడంతో ఆ కార్యక్రమానికి పెద్దగా స్పందన రాలేదు దాంతో ఖంగుతిన్న నిర్వాహకులు ఆ రేటు ని సగానికి తగ్గించారట అయినప్పటికీ టికెట్లు అలాగే ఉండిపోవడంతో మరింతగా తగ్గించారు . అప్పుడు మాత్రమే కొన్ని బుకింగ్స్ జరిగాయట . అయితే అది కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మహేష్ ప్రోగ్రాం నే క్యాన్సిల్ చేసారట ఎందుకంటే తక్కువ మొత్తంతో కార్యక్రమం నిర్వహిస్తే నష్టాలు వచ్చే సూచన ఉండటంతో అది క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది . కార్యక్రమం క్యాన్సిల్ అంటే మహేష్ కు అవమానమేగా !

ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి అనే చిత్రంలో నటిస్తున్నాడు . వచ్చే ఏడాది వేసవిలో మహర్షి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై మహేష్ మాత్రమే కాదు ఫ్యాన్స్ కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు . మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రానికి ముగ్గురు నిర్మాతలు కావడం విశేషం .

- Advertisement -

English Title: shocking :NO craze for mahesh in america

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All