HomePolitical Newsరాజాసింగ్ ను పార్టీ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేస్తే ఇబ్బందులు తప్పవు!!

రాజాసింగ్ ను పార్టీ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేస్తే ఇబ్బందులు తప్పవు!!

రాజాసింగ్ ను పార్టీ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేస్తే ఇబ్బందులు తప్పవు!!
రాజాసింగ్ ను పార్టీ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేస్తే ఇబ్బందులు తప్పవు!!

రాజాసింగ్ వ్యవహారంలో బీజేపీ అధిష్టానం తీసుకొనే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందన్నది హాట్‌ టాపిక్‌ అయింది. చాలా ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి కారణం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటూ పలువురు ఆరోపించారు. ఆయన చేసిన ఓ వీడియో వివాదానికి కారణం అయ్యిందని ఆగ్రహించారు. ఫలింతంగా రాజాసింగ్‌ జైలుకు వెళ్లారు.

రాజాసింగ్ ఆ వీడియో రూపొందించడానికి కారణాలు ఏవైనా.. పార్టీ మాత్రం చర్యలు తీసుకుంది. పార్టీ పదవులు సహా.. బీజేపీ శాసనసభాపక్ష నేత పదవీ నుంచి తొలగించింది. పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదో వివరణ ఇవ్వాలని 10 రోజులు గడువు ఇచ్చింది. కానీ ఆ 10 రోజుల్లో పరిణామాలు వేగంగా మారిపోయాయి. నేటితో పార్టీ ఇచ్చిన గడువు ముగుస్తుంది. దీంతో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ నెలకొంది. బీజేపీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన 10 రోజుల గడువులో రాజాసింగ్ వివరణ ఇవ్వలేదు. వీడియో వివాదంలో భాగంగా అయన్ని అరెస్టు చేయడం, ఆ వెంటనే జైలుకు తరలించడం చకచకా జరిగిపోయాయి.

- Advertisement -

దీంతో వివరణ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. రాజాసింగ్ జైలులో ఉన్న కారణంగా పార్టీకి వివరణ ఇవ్వలేదని ఆయన భార్య క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు. వివరణ ఇవ్వడానికి మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. అయితే రాజాసింగ్ ను పార్టీ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేస్తే ఇబ్బందులు తప్పవు అనే ఆలోచనలో బీజేపీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. ఇప్పటికే పలు హిందూ సంఘాలతో పాటు.. బీజేపీ కార్యకర్తలు కూడా ఆయనకు మద్దతుగా పలుకుతున్నారు. ఈనేపధ్యంలో రాజాసింగ్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించడం సరికాదనే అభిప్రాయానికి బీజేపీ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇంకా కఠినంగా వ్యవహరిస్తే.. తెలంగాణలో.. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పార్టీకి ఇబ్బందులు తప్పవని ఇప్పటికే కొంతమంది నేతలు..పెద్దల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. రాజాసింగ్ పార్టీ లైన్ దాటిన విషయం వాస్తవమే అయినా.. ఆయన్ను మళ్లీ పార్టీలోకి తీసుకోవాలని చెప్పనట్టు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All