Homeటాప్ స్టోరీస్హైదరాబాద్ పేరు మారుస్తా :రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ పేరు మారుస్తా :రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Hyderabad name will be changed to Bhagyanagar - Rajasinghభాగమతి పేరుకి గుర్తుగా నిర్మించిన నగరమే భాగ్యనగరం అయితే కాలక్రమంలో భాగ్యనగరం పేరు కాస్త హైదరాబాద్ గా మార్చారు అప్పటి నవాబులు . కట్ చేస్తే హైదరాబాద్ పేరు భాగ్యనగరంగా మారుస్తామని సంచలన వ్యాఖ్యలు చేసాడు భారతీయ జనతా పార్టీ నాయకుడు గోషామహల్ మాజీ ఎం ఎల్ ఏ రాజా సింగ్ . గత శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరుపున గోషామహల్ లో పోటీ చేసి గెలిచాడు రాజా సింగ్ . ఇక గెలిచినప్పటి నుండి రాజా సింగ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు . తాజాగా హైదరాబాద్ నగర పేరుని భాగ్యనగరం గా మారుస్తానని అంటున్నాడు రాజా సింగ్ .

హిందువుల ఓట్ల ని ఆకర్షించడానికి రాజా సింగ్ పెద్ద మాస్టర్ ప్లానే వేసాడు . హైదరాబాద్ నగరంలో కాస్త భారతీయ జనతా పార్టీకి పట్టు ఉంది దాంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాన్ని సొమ్ము చేసుకోవడానికి రాజా సింగ్ గతకొంత కాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు . ఇక ఇప్పుడేమో ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేసాడు . అందుకే ఇలా వ్యాఖ్యానించాడని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు . తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒంటరి అయ్యింది . డిసెంబర్ లో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని కళలు కంటున్నారు కమలనాధులు .

- Advertisement -

English Title: Hyderabad name will be changed to Bhagyanagar – Rajasingh

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All