Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్, చరణ్ ల సినిమాకు రికార్డ్ స్థాయి బిజినెస్

ఎన్టీఆర్, చరణ్ ల సినిమాకు రికార్డ్ స్థాయి బిజినెస్

Huge demond for NTR , charan's RRRఎన్టీఆర్రాంచరణ్ ల మల్టీస్టారర్ చిత్రానికి రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగేలా ఉంది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే . డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి అప్పుడే బిజినెస్ సర్కిల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది . తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అన్ని ఏరియాలు , శాటిలైట్ , డిజిటల్ రైట్స్ కలుపుకొని 500 కోట్లకు పైగా బిజినెస్ కావడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ వర్గాలు . ఒకవైపు ఎన్టీఆర్ , చరణ్ ల వంటి మాస్ హీరోలు , మరోవైపు రాజమౌళి కావడంతో ఈ సినిమాకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది .

దాంతో అన్ని హక్కులు కలుపుకొని 500 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం ఖాయమని ధీమాగా ఉన్నారు . ఇప్పటికే పలు ఏరియాల నుండి భారీ ఆఫర్లు వస్తున్నప్పటికీ దర్శక నిర్మాతలు మాత్రం తొందరపడటం లేదు . ఇక ఈరోజు నుండి ఎన్టీఆర్ – చరణ్ లపై భీకరమిన పోరాట దృశ్యాలు చిత్రీకరించడానికి సమాయత్తం అవుతున్నాడు జక్కన్న . ఆర్ ఆర్ ఆర్ వర్కింగ్ టైటిల్ కాగా ఈ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ కోసం ఆలోచన చేస్తున్నారు . అలాగే రామ రావణ రాజ్యం అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నారు .

- Advertisement -

English Title: Huge demond for NTR , charan’s RRR

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All