Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ -చరణ్ ల సినిమాపై కన్నేసిన బాలీవుడ్

ఎన్టీఆర్ -చరణ్ ల సినిమాపై కన్నేసిన బాలీవుడ్

Karan johar focus on RRRటాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ” ఆర్ ఆర్ ఆర్ ” అన్న విషయం అందరికీ తెలిసిందే . ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి . ఈ సినిమాని సొంతం చేసుకోవడానికి పలువురు ప్రముఖులు పోటీ పడుతున్నారు . ఇక బాలీవుడ్ లో కూడా ఈ సినిమా కోసం పోటీ పడుతున్నారు . అందులో కరణ్ జోహార్ కూడా ముందు వరుసలో ఉన్నాడు . జక్కన్న రూపొందించిన బాహుబలి , బాహుబలి 2 చిత్రాలను బాలీవుడ్ లో రిలీజ్ చేసింది కరణ్ జోహార్ అన్న విషయం తెలిసిందే . ఆ సినిమాలతో భారీగా డబ్బులు మూటగట్టుకున్నాడు కరణ్ అందుకే రాజమౌళి సత్తా ఏంటో తెలుసు కాబట్టి ఆర్ ఆర్ ఆర్ చిత్ర బాలీవుడ్ హక్కులు తీసుకోవడానికి అప్పుడే చర్చలు జరుపుతున్నాడట కరణ్ .

ఆల్రెడీ జక్కన్న తో అలాగే నిర్మాత డివివి దానయ్య తో కూడా మాట్లాడాడట కరణ్ జోహార్ . ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని కరణ్ రిలీజ్ చేస్తే భారీ లెవల్లో రిలీజ్ కావడం ఖాయం అందుకే రాజమౌళి కూడా కరణ్ పట్ల మొగ్గు చూపుతున్నాడట కానీ డబ్బుల విషయంలో మాత్రం పట్టిన పట్టు వీడేలా లేరట . ఎన్టీఆర్ – చరణ్ ల కాంబినేషన్ అంటే యమా క్రేజ్ దాంతో దాన్ని క్యాష్ చేసుకోనున్నాడు దానయ్య .

- Advertisement -

English Title: Karan johar focus on RRR

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All