Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ డుమ్మా కొట్టాడు

ఎన్టీఆర్ డుమ్మా కొట్టాడు

Ntr and kalyan ram not attend with suhasiniతెలుగుదేశం పార్టీ తరుపున ఎన్టీఆర్ అక్క కళ్యాణ్ రామ్ చెల్లెలు కూకట్ పల్లి నుండి పోటీ చేస్తోంది దాంతో ఇద్దరు అన్నాదమ్ములు ప్రెస్ నోట్ హడావుడిగా విడుదల చేసారు , అక్క గెలవాలని ఆకాంక్షించారు అయితే అక్క తరుపున ప్రచారం చేస్తాడా ? లేదా ? చెప్పలేదు ఎన్టీఆర్ . దాంతో మళ్ళీ కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . తెలంగాణలో ఎన్నికలు సమీపించిన తరుణంలో యుద్ధ వాతావరణం నెలకొంది . ఈరోజు ఉదయం బాలయ్య బాబాయ్ తో కలిసి ఎన్టీఆర్ అక్క సుహాసిని ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి తాత నందమూరి తారకరామారావు కు నివాళులు అర్పించి ఆశీస్సులు అందుకుంది . ఆ తర్వాత మహాప్రస్థానం లోని హరికృష్ణ సమాధి వద్దకు చేరుకొని అక్కడ కూడా నివాళులు అర్పించింది తండ్రికి .

అయితే ఆమె వెంట బాలయ్య బాబాయ్ , రామకృష్ణ బాబాయ్ లు ఉన్నారు కానీ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు లేరు దాంతో విమర్శలు మొదలయ్యాయి . అవి ఇంకా పెద్దవి కాకముందే మేలుకుంటే మేలని భావించారేమో ఓ ప్రెస్ నోట్ విడుదల చేసారు అన్నాదమ్ములు ఇద్దరూ . ప్రెస్ నోట్ అయితే విడుదల చేసారు , అక్క గెలవాలని కోరుకున్నారు కానీ ప్రచారం చేస్తారా ? లేదా ? అన్నది మాత్రం చెప్పలేదు . ఇందులో మతలబు ఏంటో మరి , లోగుట్టు పెరుమాళ్ళ కెరుక ? అంతేకదా !

- Advertisement -

English Title: Ntr and kalyan ram not attend with suhasini

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All