Homeటాప్ స్టోరీస్మహేష్ చిత్రానికి అంత బడ్జెటా ?

మహేష్ చిత్రానికి అంత బడ్జెటా ?

huge budjet for mahesh babu and sukumar filmమహేష్ బాబు తాజాగా 25 వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కాగా 26 వ చిత్రాన్ని కూడా లైన్ లో పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు . సుకుమార్ దర్శకత్వంలో తన 26వ చిత్రాన్ని చేయడానికి అంగీకరించాడు మహేష్ , మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి బడ్జెట్ ఎంతో తెలుసా …….. 150 కోట్లు . అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ 150 కోట్ల భారీ బడ్జెట్ తో మహేష్ 26వ చిత్రం రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు .

150 కోట్ల బడ్జెట్ అంటే అందరికీ లాభాలు రావాలంటే 300 కోట్ల భారీ వసూళ్లు సాధించాలి . బాహుబలి మినహా మరే చిత్రం కూడా 200 కోట్లు దాటలేదు ఈమద్యే రంగస్థలం మాత్రం 213 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది . బడ్జెట్ 150 కోట్లు పెడితే ఆ మొత్తం రికవరీ కావాలంటే ఖచ్చితంగా 300 కోట్లు రాబట్టాలి మరి ఆ దమ్ము సినిమాకు ఉంటుందా ? ఏమాత్రం తేడా కొట్టినా నిర్మాతలతో పాటుగా బయ్యర్లు కూడా రోడ్డున పడతారు . అది తెలిసి కూడా అంత ధైర్యం చేస్తున్నారంటే ఏమో ! గుర్రం ఎగరావచ్చు అని సరిపెట్టుకోవలసిందే . మహేష్ – సుకుమార్ ల కాంబినేషన్ లో 1 నేనొక్కడినే ఘోర పరాజయం పొందింది మరి .

- Advertisement -

English Title: huge budjet for mahesh babu and sukumar film

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All