Friday, August 12, 2022
Homeటాప్ స్టోరీస్చిరు మందు పార్టీలో ఎంజాయ్ చేసిన దర్శకులు

చిరు మందు పార్టీలో ఎంజాయ్ చేసిన దర్శకులు

chiranjeevi birth day bash at allu aravinds houseమెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని మందు పార్టీ ఇవ్వగా ఆ పార్టీకి హాజరై ఫుల్లుగా లాగించారు కొంతమంది దర్శకులు . చిరు బామ్మర్ది అల్లు అరవింద్ ఇంట్లో ఇచ్చిన ఈ పార్టీ లో దర్శకులు కొరటాల శివ , బోయపాటి శ్రీను , సుకుమార్ , వంశీ పైడిపల్లి , మెహర్ రమేష్ , వక్కంతం వంశీ లతో పాటుగా హీరో లు అల్లు అర్జున్ , చరణ్ , అల్లు శిరీష్ తదితరులు పాల్గొన్నారు . చిరుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా మందు పార్టీలో మునిగి తేలారు .

- Advertisement -

సుకుమార్ చరణ్ తో రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ నివ్వగా బోయపాటి శ్రీను ప్రస్తుతం చరణ్ తో ఓ సినిమా చేస్తున్నాడు ,అలాగే కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి తో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . సైరా ….. నరసింహారెడ్డి సినిమా తర్వాత కొరటాల శివ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది . వీళ్ళతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు చిరు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు .

English Title: chiranjeevi birth day bash at allu aravinds house

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts