HomeUncategorizedత‌లైవాకు మ‌ద్రాస్ హైకోర్ట్ షాకిచ్చిందా?

త‌లైవాకు మ‌ద్రాస్ హైకోర్ట్ షాకిచ్చిందా?

త‌లైవాకు మ‌ద్రాస్ హైకోర్ట్ షాకిచ్చిందా?
త‌లైవాకు మ‌ద్రాస్ హైకోర్ట్ షాకిచ్చిందా?

త‌మిళ సూప‌ర్‌స్టార్ గ్రేట‌ర్ చెన్నై కార్పొరేష‌న్‌పై హైకోర్టులో పిటీష‌న్ వేశారు. దీనిపై విచార‌ణ‌ చేప‌ట్టిన కోర్టు ధ‌ర్మాస‌నం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై విరుచుకుపడింది. వివ‌రాల్లోకి వెళితే… కోడంబాక్కంలో ర‌జనీ రాఘ‌వేంద్ర‌ క‌ల్యాణ‌మండ‌పాన్ని తీసుకున్నారు. దీనికి ఆస్థి ప‌న్ను చెల్లించాల‌‌ని  గ్రేట‌ర్ చెన్నై కార్పొరేష‌న్ రజినిని కోరింది.

గ్రేట‌ర్ చెన్నై కార్పొరేష‌న్ నుంచి నోటీసులు అందుకున్న ర‌జ‌నీ  మద్రాస్ హైకోర్టుని ఆశ్ర‌యించారు. ఒక ఆస్తి వాణిజ్యపరంగా ఒక నెలకు పైగా నిరుప‌యోగంగా వుంటే అటువంటి ఆస్తిపై ప‌న్నుని పూర్తిగా చెల్లించ‌డానికి వీలు లేద‌ని మార్చి 24 నుండి ఇది నిరూప‌యోగంగా వుంద‌ని, ఎలాంటి ఆదాయం రావ‌డం లేద‌ని, ఆస్తి ప‌న్నుని మాఫీ చేయాల‌ని రజినీ తన పిటిషన్లో కోరారు.

- Advertisement -

రజ‌ని రిట్ పిటీష‌న్ ని బుధ‌వారం విచారించిన జ‌స్టిస్ అనితా సుమంత్ త‌లైవాపై విరుచుకుప‌డ్డారు. ఆస్టి ప‌న్ను చెల్లించ‌కుండా కార్పొరేన్‌పై పిటీష‌న్ ఎలా వేస్తార‌ని, దీని కోసం మా విలువైన స‌మ‌యాన్ని వృధా చేశార‌ని మీపై జ‌రిమానా కూడా విధించే అవ‌కాశం వుంద‌ని మండిప‌డ్డారు. దీంతో షాక్ కు గురైన ర‌జ‌నీ న్యాయ‌వాది కేసు ఉప‌సంహ‌రించుకోవ‌డానికి త‌గిన స‌మ‌యం కావాలని కోర్టుకు తెలియ‌జేశార‌ట‌. ఈ విష‌యం ర‌జ‌నీని తీవ్ర ఇబ్బందికి గురిచేసిన‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All