HomeUncategorizedభీమ్లా నాయక్ లో రానా రోల్ లో కొడాలి నాని నటిస్తే ఏపీలో బ్లాక్ బస్టర్...

భీమ్లా నాయక్ లో రానా రోల్ లో కొడాలి నాని నటిస్తే ఏపీలో బ్లాక్ బస్టర్ అయ్యేది – పూనమ్ కౌర్ ట్వీట్

poonam kaur satirical tweet on kodali nani
poonam kaur satirical tweet on kodali nani

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ తో పాటు పలు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్‌ మేనియా నడుస్తోంది. ఎక్కడ చూసినా భీమ్లా నాయక్‌కు సంబంధించిన చర్చే జరుగుతోంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో పూనమ్ కౌర్ సైతం భీమ్లా నాయక్ మూవీ గురించి ఆరా తీయడం రిలీజ్ రోజు వైరల్ గా మారింది.

తాజాగా మరోసారి భీమ్లా నాయక్ గురించి సంచలన ట్వీట్ చేసి వార్తల్లో నిలిచింది. భీమ్లా నాయక్ చిత్రానికి ఏపీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురువుతున్నాయో తెలియంది కాదు..రిలీజ్ రోజు బెనిఫిట్ షోస్ కు అనుమతి ఇవ్వక పోవడం , టికెట్స్ ధరలు పెంచుకునే వెసులుబాటు లేకుండా చేయడం , అదనపు షోస్ కు సైతం పర్మిషన్ ఇవ్వకుండా అతి తక్కువ ధరలకే సినిమా ప్రదర్శించాలని ఉత్తర్వులు జారీచేయడం చేసారు. ప్రస్తుతం సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ హౌస్ ఫుల్ తో రన్ అవుతున్నప్పటికీ రూ.5 , రూ. 10 ధరలకే టికెట్స్ ఉండడం తో బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టంగా మారింది. ఈ తరుణంలో పూనమ్ కౌర్ ట్విట్టర్ లో మంత్రి నాని ఫై సంచలన ట్వీట్ చేసింది.

- Advertisement -

భీమ్లా నాయక్ సినిమాలో డానియల్ శేఖర్ (మతం మార్చుకున్న క్రిస్టియన్) పాత్రలో కొడాలి నాని నటిస్తే ఏపీలో భీమ్లా నాయక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది.. అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ వేసింది. జస్ట్ ఫర్ ఫన్ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ కూడా వేసింది. కానీ ఆ తర్వాత ఆ ట్వీట్ ను డిలీట్ చేసింది. అప్పటికే ఆ ట్వీట్ వైరల్ కావడం తో నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All