Homeటాప్ స్టోరీస్స్టార్ లని వదిలేసి చిన్న హీరోతో సినిమానా

స్టార్ లని వదిలేసి చిన్న హీరోతో సినిమానా

director teja shocking decisionసీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్ లతో సినిమాలు చేసే ఛాన్స్ వస్తే వాటిని వదిలేసి కనీసం రానా లాంటి హీరోతో అయినా చేయకుండా పెద్దగా హిట్స్ లేని ఇంకా హీరోగా నిలబడలేని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడట దర్శకులు తేజ . ఒకప్పుడు ఈ దర్శకుడు సినిమా అంటే అగ్ర హీరోలు సైతం అతడితో పనిచేయాలని ఆశపడేవాళ్లు కానీ తేజ మాత్రం కొత్తవాళ్లతో మీడియం హీరోలతోనే సినిమాలు చేసి హిట్స్ కొట్టాడు . కట్ చేస్తే బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన తేజ డిజాస్టర్ లు ఇవ్వడం మొదలు పెట్టాడు దాంతో దర్శకుడిగా అతడి గ్రాఫ్ పడిపోయింది . దాంతో కసిగా ఓ సబ్జెక్ట్ రెడీ చేసుకొని రానా తో ” నేనేరాజు నేనే మంత్రి ” సినిమా చేసాడు సూపర్ హిట్ కొట్టాడు .

ఆ సక్సెస్ ఇచ్చిన ఊపుతో పలువురు తేజ తో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు అయితే సీనియర్ హీరో వెంకటేష్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు అంతా ఒకే అనుకున్న సమయంలో బాలయ్య నుండి పిలుపు రావడంతో వెంకీ ని వదిలేసి ఎన్టీఆర్ బయోపిక్ చేయడానికి ఒప్పుకున్నాడు . స్క్రిప్ట్ అంతా సిద్దమై షూటింగ్ కూడా ప్రారంభమైనది అయితే ఎక్కడో తేడా కొట్టడంతో ఎన్టీఆర్ బయోపిక్ నుండి తప్పుకున్నాడు తేజ . ఇక ఇప్పుడేమో హీరోగా నిలదొక్కుకోవడానికి సతమతం అవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట దాంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు తేజ పరిస్థితి చూసి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All