Homeటాప్ స్టోరీస్దర్శకులు తేజ పై బాంబ్ పేల్చిన శ్రీరెడ్డి

దర్శకులు తేజ పై బాంబ్ పేల్చిన శ్రీరెడ్డి

srireddy shocking comments on director tejaదర్శకులు తేజ పై బాంబ్ పేల్చి సంచలనం సృష్టించింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి . కాస్టింగ్ కౌచ్ వివాదం గతనెల రోజుల నుండి తెలుగు చిత్ర పరిశ్రమని అతలాకుతలం చేస్తూనే ఉంది కాగా కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి తాజాగా మరో బాంబ్ పేల్చి మళ్ళీ కాస్టింగ్ కౌచ్ వివాదాన్ని తేనే తుట్టెలా కుదిపేసింది . అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చిన్నబ్బాయ్ అభిరామ్ విషయంలో 5 కోట్లు ఇప్పిస్తామని వర్మ నాకు ఆఫర్ ఇచ్చాడని కానీ దాన్ని తిరస్కరించి పోరాటానికి సిద్దపడ్డానని చెప్పిన శ్రీరెడ్డి తాజాగా దర్శకులు తేజ నాకు సురేష్ బాబు దగ్గర నుండి డబ్బులు ఇప్పిస్తానని అన్నాడని సంచలన వ్యాఖ్యలు చేసింది .

దర్శకులు తేజ బాలయ్య తో ఒక సినిమా , వెంకటేష్ తో ఒక సినిమా చేయబోతున్నాడు కాబట్టి ఆ రెండిట్లో శ్రీరెడ్డి కి ఛాన్స్ ఇస్తానని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు అప్పట్లో కట్ చేస్తే ఇప్పుడు తేజ కు ఆ రెండు సినిమాలు లేకుండా పోయాయి ఆ విషయం పక్కన పెడితే …… సురేష్ బాబు పెద్ద నిర్మాత కాబట్టి ఆయన పై పోరాడితే లాభం ఉండదని కాబట్టి నా మాట వింటే సురేష్ బాబు దగ్గర కొంత డబ్బు ఇప్పిస్తాను దానితో పాటు మా లో మెంబర్ షిప్ ఫ్రీగా ఇప్పించడమే కాకుండా నా రెండు సినిమాల్లో మంచి వేషాలు ఇస్తానని శ్రీరెడ్డి కి మాట ఇచ్చాడట అయితే డబ్బులకు లొంగలేదని ఆ తర్వాత మాత్రమే మరో దర్శకులు వర్మ ఈ సెటిల్ మెంట్ లోకి వచ్చాడని కానీ మొదట ఈ విషయాన్ని డీల్ చేసింది దర్శకులు తేజ అని సంచలనం సృష్టించింది . ఇక ఈ గొడవ సద్దుమణిగినట్లే అని భావిస్తున్న ఈ తరుణంలో శ్రీరెడ్డి మరింత నిప్పు రాజేసింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All