Homeటాప్ స్టోరీస్అంత ఖర్చు పెడితే తిరిగి వస్తుందా

అంత ఖర్చు పెడితే తిరిగి వస్తుందా

huge budjet for bellamkonda sai srinivas sakshyam బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని హీరోగా నిలబెట్టడానికి ఎంత రిస్క్ అయినా తీసుకుంటున్నాడు బెల్లంకొండ సురేష్ . మొదటి సినిమా అల్లుడు శీను వినాయక్ మేజిక్ బాగానే పనిచేసింది దాంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు హీరోగా మంచి ఎంట్రీ లభించింది . అయితే రెండో సినిమా స్పీడున్నోడు సినిమా చేశారు అది డిజాస్టర్ అయ్యింది దాంతో బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయ జానకి నాయక అనే చిత్రాన్ని చేసారు అది కాస్ట్ ఫెయిల్యూర్ అయ్యింది . ఇక ఇప్పుడేమో శ్రీవాస్ దర్శకత్వంలో ” సాక్ష్యం ” అంటూ చేస్తున్నాడు . త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతున్న ఈ సినిమాకు 35 కోట్ల నుండి 40 కోట్లు అయ్యేలా ఉందట బడ్జెట్ .

అంతగా స్టార్ డం లేని హీరో కు అంత ఖర్చు పెడితే మళ్ళీ ఆ స్థాయిలో పెట్టుబడి తిరిగి వస్తుందా అంటే మిలియన్ డాలర్ల ప్రశ్నే ! ఎందుకంటే ఇప్పటివరకు ఈ హీరో చేసిన మూడు సినిమాలు కూడా పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టలేక పోయాయి . అయినప్పటికీ 30 కోట్లు , 40 కోట్లు పెట్టుకుంటూ పోతే తిరిగి రాబట్టడం అంత సులువు కాదు . ఈ విషయం తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు బెల్లంకొండ సురేష్ . సాక్ష్యం సినిమాకు పేరుకి అభిషేక్ అయినప్పటికీ తెరవెనుక మాత్రంగం అంతా నడిపించేది బెల్లంకొండ సురేషె ! ఇప్పటికే మూడు సినిమాలతో దెబ్బ తిన్నప్పటికీ మళ్ళీ భారీగానే ఖర్చు పెడుతున్నారు ఏంటో ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All