Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ ఇమేజ్ డ్యామేజ్

విజయ్ దేవరకొండ ఇమేజ్ డ్యామేజ్

controversy on vijay devarakondas what the F songఅర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ . యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ కు నిన్న మొన్నటి వరకు ఎదురులేకుండా పోయింది అయితే తాజాగా జరిగిన ఓ సంఘటనతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు పైగా ఆ ఒక్క పాటతో ఈ హీరో ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది ఇంతకీ ఈ క్రేజ్ హీరో ఇమేజ్ ని డ్యామేజ్ చేసిన సంగతి ఏంటో తెలుసా ……. గీత గోవిందం చిత్రంలో ఒక పాట పాడటమే ! గీత గోవిందం చిత్రం కోసం సింగర్ అవతారం ఎత్తాడు విజయ్ దేవరకొండ . శ్రీ మణి రాసిన ” అమెరికా గాళ్ అయినా ” అనే పాట పాడాడు .

అయితే ఆ పాటలో కొన్ని అనుచిత పదాలు దొర్లడం , వాటిని విజయ్ దేవరకొండ పాడటం తో నెటిజన్లు ఖంగుతిన్నారు అలాగే మిగతా వర్గాల నుండి కూడా ఆగ్రహం వ్యక్తం కావడంతో వెంటనే యు ట్యూబ్ లోంచి విజయ్ దేవరకొండ పాడిన పాట తొలగించారు . ఈ పాటతో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ కు స్పీడు బ్రేకర్ అయ్యిందనే చెప్పాలి . యువత ని విపరీతంగా ఆకట్టుకుంటుందని ఆ చిత్ర బృందం భావించింది కానీ సీన్ రివర్స్ అయ్యింది దాంతో ఆ పాటని తొలగించారు అంతేకాదు ఆ పాటలో ఉన్న అభ్యంతరకరమైన పదాలను తీసేసి మళ్ళీ రాసాక మీముందుకు వస్తామని సారీ చెప్పాడు రచయిత శ్రీమణి . ఇక గీత గోవిందం చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది .

- Advertisement -

English Title: controversy on vijay devarakondas what the F song

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All