Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ ఎందుకు వెళ్లినట్లు

విజయ్ దేవరకొండ ఎందుకు వెళ్లినట్లు

bad sentiment for bigg boss 2తాజాగా బిగ్ బాస్ 2 హౌజ్ లోకి హీరో విజయ్ దేవరకొండ వెళ్ళాడు అయితే బిగ్ బాస్ 2 లో కి వెళ్లి తమ సినిమాల ప్రమోషన్ చేసుకుందామని ఆశించిన వాళ్లకు నిరాశే ఎదురయ్యింది ఇప్పటివరకు . మంచు లక్ష్మి వైఫ్ ఆఫ్ రామ్ కోసం , సాయి ధరమ్ తేజ్ తేజ్ ఐ లవ్ యు కోసం , శ్రీనివాసరెడ్డి జంబలకిడి పంబ కోసం వెళ్లారు కానీ ఆ మూడు చిత్రాలు కూడా డిజాస్టర్ అయ్యాయి . మొదటి సీజన్ హిట్ కాగా రెండో బిగ్ బాస్ అంతగా సక్సెస్ కాలేదు దానికి తోడు ఈ బ్యాడ్ సెంటిమెంట్ కూడా యాడ్ అయ్యింది బిగ్ బాస్ 2 లోకి వెళితే సినిమా ప్లాప్ అవుతుందని .

ఇక ఇప్పుడేమో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ 2 హౌజ్ లోకి వెళ్లడంతో అది సినిమా కోసం లేక ఇతర ప్రమోషన్ కోసమా అన్నది తేలాల్సి ఉంది ఎందుకంటే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ” గీత గోవిందం ” ఆగస్టు 15న విడుదల అవుతోంది . ఇప్పుడే ఆ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి దానికి తోడు ఈ హీరోకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉండటంతో గీత గోవిందం పై అంచనాలు బాగానే ఉన్నాయి . అయితే ఆ సినిమా రిజల్ట్ ఏమౌతుందో అన్న అనుమానం అప్పుడే నెలకొంది ఎందుకంటే బిగ్ బాస్ 2 షోలో పాల్గొంటే ఆ సినిమా ప్లాప్ అన్న ముద్ర పడిపోతోంది . విజయ్ దేవరకొండ బిగ్ బాస్ 2 హౌజ్ లోకి వెళ్ళింది ఎందుకో తెలిస్తే సగం టెన్షన్ పోతుంది . ఇక ఆ సెంటిమెంట్ ని పక్కన పెడితే గీత గోవిందం చిత్రానికి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి మరి .

- Advertisement -

English Title: bad sentiment for bigg boss 2

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All