Homeగాసిప్స్చిరు రీమేక్ లిస్ట్ లో యంగ్ డైరెక్టర్ వచ్చాడే!

చిరు రీమేక్ లిస్ట్ లో యంగ్ డైరెక్టర్ వచ్చాడే!

చిరు రీమేక్ లిస్ట్ లో యంగ్ డైరెక్టర్ వచ్చాడే!
చిరు రీమేక్ లిస్ట్ లో యంగ్ డైరెక్టర్ వచ్చాడే!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. జూన్ కల్లా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి ఆగష్టులో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ శాఖలో ఉద్యోగిగా కనిపిస్తాడని అక్కడి అవినీతిని ప్రశ్నిస్తాడని బలంగా వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ముందు రామ్ చరణ్ ను అనుకున్నా చివరికి మహేష్ బాబు ఈ రోల్ లో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.

ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ ఎలాంటి సినిమా చేస్తాడన్న దానిపై గతికొద్ది కాలంగా చర్చలు జరుగుతున్న సంగతి తెల్సిందే. ఈసారి స్ట్రైట్ సినిమా కాకుండా రీమేక్ ను చేయాలని అనుకుంటున్నాడట చిరు. ఇప్పటికే మనసు పడి కొనుగోలు చేసిన మలయాళ హిట్ చిత్రం లూసిఫర్ రీమేక్ లో నటిస్తాడని అంటున్నారు. అయితే ఈ రీమేక్ కు తగ్గ దర్శకుడి కోసం రామ్ చరణ్ గత కొంత కాలంగా అన్వేషిస్తున్నాడు.

- Advertisement -

ముందు సుకుమార్ ను అనుకున్నా ముందుగా కమిట్ అయిన ప్రాజెక్ట్ ఉన్నందున కుదర్లేదు. పరశురామ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇక వివి వినాయక్ చేతిలో ఈ చిత్రాన్ని పెడదామని భావించారు. చిరంజీవికి వినాయక్ అంటే గురి ఎక్కువ తన రీ ఎంట్రీ విషయంలో కూడా వినాయక్ కే బాధ్యతలు అప్పగించాడు. మరోసారి చిరుతో వినయ్ కలిసి పనిచేయడం ఖరారని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో చిన్న ట్విస్ట్ వచ్చినట్లు తెలుస్తోంది.

చిరు వినాయక్ వైపు మొగ్గు చూపుతుంటే రామ్ చరణ్ ఎవరైనా యంగ్ దర్శకుడైతే ఈ చిత్రంలో బాగుంటుందని అనుకుంటున్నాడట. సుజీత్ ఐతే ఎలా ఉంటుందన్న చర్చ వచ్చినట్లు తెలుస్తోంది. సాహో ప్లాప్ అయినా టేకింగ్ పరంగా సుజీత్ కొత్తదనం చూపించగలిగాడు. ఈ నేపథ్యంలో సుజీత్ కు ఈ చిత్ర రీమేక్ తెరకెక్కించే పని పెడతారా అన్నది చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All