Homeగాసిప్స్చిరంజీవి ఆచార్య అయితే చరణ్ సిద్ధూ అంటున్నారు!

చిరంజీవి ఆచార్య అయితే చరణ్ సిద్ధూ అంటున్నారు!

చిరంజీవి ఆచార్య అయితే చరణ్ సిద్ధూ అంటున్నారు!
చిరంజీవి ఆచార్య అయితే చరణ్ సిద్ధూ అంటున్నారు!

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్న విషయం తెల్సిందే. మంచి సబ్జెక్ట్ లు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్న చిరు, ఖైదీ నెం 150తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత సైరాతో తన చిరకాల కోరికను తీర్చుకున్నాడు. ఇప్పుడు తన 152వ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఒక పక్కా కమర్షియల్ కథకు సామాజిక బాధ్యతను కూడా జోడించి సినిమాలు తీయగల సత్తా ఉన్న కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఎప్పటినుండో ఈ చిత్రంలో చిరంజీవి దేవాదాయ శాఖలో ఉద్యోగిగా కనిపిస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. దీన్ని చిరు 152 టీమ్ ఖండించకపోవడంతో ఇదే నిజమని ఆడియన్స్ నమ్ముతున్నారు.

ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. సమ్మర్ కల్లా షూటింగ్ మొత్తాన్ని ఫినిష్ చేయాలని చిరు భావిస్తున్నాడు. కొరటాల శివ కూడా 99 రోజుల వర్కింగ్ డేస్ కు ఒక్క రోజు కూడా ఎక్కువ చేయనని మాట ఇచ్చినట్లు తెలిపారు. ఈ చిత్ర విశేషాల్లో మరొకటి.. ఇందులో చిరంజీవి గోవిందాచార్య పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి తోడు ఇందులో చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

రామ్ చరణ్ పాత్ర 15 నుండి 20 నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో ఉన్న చరణ్ దాన్ని ముగించుకుని చిరు 152 షూటింగ్ లో జాయిన్ అవుతాడు. ఇందులో చరణ్ నటించే పాత్ర పేరు సిద్దూ అని అంటున్నారు. అయితే వీటిలో నిజాలు ఏవో ఆ చిత్ర టీమ్ కే తెలియాలి. ఆగష్టు 12 లేదా 14న ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.

జూలై లో ఆర్ ఆర్ ఆర్ విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు అది వాయిదా పడడంతో సంక్రాంతి తర్వాత విడుదలయ్యే పెద్ద సినిమా ఇదే కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All