Homeగాసిప్స్రామ్ చరణ్ తన మనసు మార్చుకున్నాడా?

రామ్ చరణ్ తన మనసు మార్చుకున్నాడా?

రామ్ చరణ్ తన మనసు మార్చుకున్నాడా?
రామ్ చరణ్ తన మనసు మార్చుకున్నాడా?

ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ వాయిదా పడినా కానీ రాజమౌళి తన హీరోలను ఇబ్బంది పెట్టట్లేదు. బాహుబలి కోసం ప్రభాస్ ను ఐదేళ్లు తన వద్దే లాక్ చేసుకున్న రాజమౌళి ఈసారి పట్టు విడుస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ జనవరి 8, 2021కి వాయిదా పడిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ నటిస్తోన్న ఇద్దరు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా అప్పటివరకూ మరో సినిమా చేయడానికి ఉండదని అభిమానులు ఫీలయ్యారు. అయితే అదేమీ నిజం కాదని, రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూట్ పూర్తైన తర్వాత ఇద్దరు హీరోలకు తమ తమ తర్వాతి సినిమాలు చేసుకునే వెసులుబాటును కల్పించాడు. ఇప్పటికే ఎన్టీఆర్ తన తర్వాతి చిత్రాన్ని కన్ఫర్మ్ చేసుకున్న విషయం తెల్సిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే చిత్రం ఈ మే నుండి షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏప్రిల్ కు సినిమాను విడుదల చేస్తారు.

ఇప్పుడు రామ్ చరణ్ కూడా తన తర్వాతి సినిమాపై దృష్టి పెట్టాడు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత చేయబోయే సినిమా కోసం కథలు వింటున్నాడు. ఎన్టీఆర్ లా స్టార్ డైరెక్టర్ తో కాకుండా చరణ్ యువ దర్శకులతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే సుజీత్ మరియు గౌతమ్ తిన్ననూరి చెప్పిన లైన్స్ కూడా విని ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని సూచించినట్లు సమాచారం. వీరిద్దరిలో ఎవరో ఒకరితో నెక్స్ట్ సినిమా ఉంటుందని అనుకున్నారు కానీ ఇప్పుడు పరిస్థితి బట్టి చూస్తుంటే రామ్ చరణ్ మనసు మార్చుకున్నట్లు సమాచారం.

- Advertisement -

తన నెక్స్ట్ సినిమాకు స్టార్ డైరెక్టర్ అయితేనే బెటర్ అని ఫీలవుతున్నాడట. అందుకే ఆర్ ఆర్ ఆర్ తర్వాత కొరటాల శివతోనే ముందుకెళ్లాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇప్పటికే మెగాస్టార్ తో ఆచార్యను తెరకెక్కిస్తున్న కొరటాల శివ, నెక్స్ట్ సినిమాకు కూడా మెగా క్యాంపుకే పరిమితం కానున్నాడన్నమాట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All