Homeన్యూస్భీమ్లా నాయక్ లో ఆ పదాన్ని తొలగించిన సెన్సార్

భీమ్లా నాయక్ లో ఆ పదాన్ని తొలగించిన సెన్సార్

భీమ్లా నాయక్ లో ఆ పదాన్ని తొలగించిన సెన్సార్
భీమ్లా నాయక్ లో ఆ పదాన్ని తొలగించిన సెన్సార్

పవర్ స్టార్ తన పవర్ ను చూపేందుకు భీమ్లా నాయక్ గా వస్తున్నాడు. రిలీజ్ కు రెండు రోజులే సమయమే ఉండడం తో అభిమానుల ఆత్రుత మరింత పెరుగుతుంది. ఎప్పుడెప్పుడు 25 వ డేట్ వస్తుందా..ఎప్పుడెప్పుడు  తమ దేవుడ్ని తెరపై చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా సెన్సార్ పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటె ఫైనల్ కాపీ చూసిన సెన్సార్ సభ్యులు సినిమాలో ఓ పదాన్ని తొలగించినట్లు తెలుస్తుంది. తెలుగులో అభ్యంతరకరమైన ‘లంబ్డీ’ అనే పదాన్ని తొలగించాలని కోరారట. సాధారణంగా ఈ పదాన్ని ఎవరినైనా తిట్టడానికి ఉపయోగించే పదాలకు జోడిస్తుంటారు. అందుకే దాన్ని సెన్సార్ చేసినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా బాలకృష్ణ నటించిన అఖండ మూవీ లో కూడా బాలయ్య చెప్పిన ‘లంబిడి’ అనే పదాన్ని తొలగించమని మేకర్స్ ని కోరారు. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ సినిమాలో కూడా అలాంటి పదాన్నే తొలగించమని సూచించారు.

- Advertisement -

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ మూవీ భారీ అంచనాల నడుమ ఈ నెల 25 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. వాస్తవానికి జనవరి సంక్రాంతి రేస్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసినప్పటికీ పలు కారణాల కారణంగా ఫిబ్రవరి 25 కు వాయిదా పడింది.  సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ అందించడం విశేషం. థమన్ మ్యూజిక్ అందించగా.. నిత్య మీనన్, సంయుక్త మీనన్లు హీరోయిన్లు గా నటించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All