Homeన్యూస్భీమ్లా నాయక్ టికెట్స్ బుక్ మై షో లో బుక్ చేసుకోలేరా..?

భీమ్లా నాయక్ టికెట్స్ బుక్ మై షో లో బుక్ చేసుకోలేరా..?

భీమ్లా నాయక్ టికెట్స్ బుక్ మై షో లో బుక్ చేసుకోలేరా..?
భీమ్లా నాయక్ టికెట్స్ బుక్ మై షో లో బుక్ చేసుకోలేరా..?

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ మూవీ భారీ అంచనాల నడుమ ఈ నెల 25 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. వాస్తవానికి జనవరి సంక్రాంతి రేస్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసినప్పటికీ పలు కారణాల కారణంగా ఫిబ్రవరి 25 కు వాయిదా పడింది. మొన్నటి వరకు కూడా ఈ డేట్ కు వస్తుందో రాదో అనే అనుమానులు ఉండేవి కానీ మేకర్స్ మాత్రం చెప్పిన తేదీకే రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే అని అభిమానులు ధీమా గా చెపుతున్నారు. ఈ క్రమంలో ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఈ సినిమా బుకింగ్ విషయంలో కొంత సమస్య తలెత్తింది అని మాట్లాడుకుంటున్నారు. సినిమా టికెట్ల బుకింగ్ యాప్ బుక్ మై షో కి టికెట్ విక్రయాల అవకాశం ఇవ్వకూడదని నైజాం డిస్ట్రిబ్యూటర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బుక్ మై షో కారణంగా ప్రేక్షకుల మీద మరీ ఎక్కువ అదనపు భారం పడుతోందని సినిమా పెద్దలు భావిస్తున్నారట.  

- Advertisement -

ఇటీవల తెలంగాణలో టికెట్ రేట్లు భారీగా పెంచుకునే అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు ఆ అమౌంట్ కి బుక్ మై షో కమిషన్ కలిపితే రేట్లు ఇంకా పెరిగాయని అంటున్నారు. ఒక వేళ అదే జరిగితే టికెట్ బుకింగ్స్ మీద గట్టి ప్రభావం కనబరిచే అవకాశం ఉంది. అందుకే కౌంటర్ సేల్ చేస్తే బెటర్ అని నిర్మాతలు నిర్ణయించి డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. మరి ఇదే జరుగుతుందా..లేక చివర్లో బుక్ మై షో కే ఇస్తారా అనేది చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All