Homeన్యూస్బిగ్ బాస్ 5: ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లేనా?

బిగ్ బాస్ 5: ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లేనా?

 

Bigg boss 5 telugu nominations candidate list
Bigg boss 5 telugu nominations candidate list

బిగ్ బాస్ సీజన్ 5 లో తొమ్మిది వారాలు గడిచిపోయాయి. హౌజ్ నుండి ఒక్కొక్కరుగా మొత్తం 9 మంది ఎలిమినేట్ అయ్యారు. హౌజ్ లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన విశ్వ నిన్న ఎలిమినేట్ కావడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ప్రస్తుతం హౌజ్ లో 10 మంది మాత్రమే ఉన్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మిగిలి ఉండడంతో ఇక నుండి అంతా టఫ్ గా ఉండనుంది.

- Advertisement -

ఎలిమినేషన్ కు కీలకమైన నామినేషన్ ఎపిసోడ్ ఈరోజు జరగనుంది. సోమవారం ఎపిసోడ్ అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఈరోజు జరగబోయే ఎపిసోడ్ కూడా ఫుల్ ట్విస్ట్ లతో సాగేలా ఉంది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేసారు. సాధారణంగా జరిగే నామినేషన్స్ ప్రక్రియ కాకుండా ఈసారి కెప్టెన్ ఎన్నీ మాస్టర్ ను నలుగురు ఇంటి సభ్యులను ఎంపిక చేసి జైలుకి పంపాలని బిగ్ బాస్ ఆదేశించారు.

ప్రోమోను బట్టి చూస్తే జైలుకు కాజల్, మానస్, సన్నీ, షణ్ముఖ్ లను ఎన్నీ జైలుకి పంపింది. ఇక వినిపిస్తోన్న సమాచారం ప్రకారం సన్నీ, రవి, మానస్, కాజల్, సిరిలు ఈ వారం నామినేషన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఎన్నీ జైలుకి పంపాక కూడా బిగ్ బాస్ ఏదో ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ ట్విస్ట్ ఏంటా అన్నది చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All