Homeన్యూస్బిగ్ బాస్: హౌజ్ నుండి ఎలిమినేట్ అయిన లోబో

బిగ్ బాస్: హౌజ్ నుండి ఎలిమినేట్ అయిన లోబో

బిగ్ బాస్: హౌజ్ నుండి ఎలిమినేట్ అయిన లోబో
బిగ్ బాస్: హౌజ్ నుండి ఎలిమినేట్ అయిన లోబో

బిగ్ బాస్ సీజన్ 5 ఈరోజుతో ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంటోంది. ఇప్పటికే ఏడుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన విషయం తెల్సిందే. అందులో ఆరుగురు లేడీ కంటెస్టెంట్స్ కాగా నటరాజ్ మాస్టర్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఈ వారం ఎలిమినేషన్ కు ఆరుగురు హౌజ్ మేట్స్ నామినేట్ అయిన విషయం తెల్సిందే.

చాలా ఎమోషనల్ అయిన నామినేషన్ ప్రాసెస్ లో ఇంటి నుండి లెటర్స్ ను చదవడానికి వేరే ఇంటి సభ్యుల కోసం స్వచ్ఛందంగా నామినేట్ అయ్యారు. లోబో, సిరి, షణ్ముఖ్, శ్రీరామ్ చంద్ర, మానస్, రవిలు ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. అయితే అందరి కంటే తక్కువ ఓట్లు రావడంతో లోబో ఈరోజు ఎలిమినేట్ కానున్నాడు.

- Advertisement -

ఈరోజు దీపావళి స్పెషల్ సందర్భంగా బిగ్ బాస్ సాయంత్రం ఆరు గంటల నుండే అందరినీ అలరించనుంది. ఈరోజు స్పెషల్ ఎపిసోడ్ గా పాత ఇంటి సభ్యులు వచ్చి కంటెస్టెంట్స్ ను పలకరించనున్నారు. అలాగే చాలా స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ లతో పాటు బోలెడన్ని ఆకర్షణలు కూడా ఉన్నాయి.

నిజానికి లోబో గత వారం ఎలిమినేషన్ డేంజర్ ను ఫేస్ చేసాడు. సీక్రెట్ రూమ్ కు వెళ్లి తిరిగి వచ్చాడు. అయితే ఈ వారం పెద్దగా హైలైట్ కాలేకపోవడంతో లోబో  వెనకబడ్డాడు. అదే తన ఎలిమినేషన్ కు దారి తీసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All